ఈ టీంతో కావ్య పాప కప్ కొట్టేనా..?
ఐపీఎల్-2025కు సంబంధించిన మెగా వేలం పాట రెండో రోజు కూడా కొనసాగుతోంది.ఎప్పటిలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఆటగాళ్ల వేలంలో తనదైన మార్క్ చూపించింది. వేలం మొదటి రోజు షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను సొంతం చేసుకుంది. షమీకి రూ.10 కోట్లు, హర్షల్ పటేల్‌కు రూ. 8 కోట్లు,11.25 కోట్లు చెల్లించి దక్కించుకుంది.
రెండో రోజు వేలంలో తక్కువ ధరకే పలువురు ఆటగాళ్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. అభినవ్ మనోహర్- రూ. 3.20 కోట్లు, రాహుల్ చాహర్- రూ. 3.20 కోట్లు, ఆడమ్ జంపా- రూ. 2.40 కోట్లు, సిమర్‌జీత్ సింగ్- రూ. 1.50 కోట్లు, అథర్వ టైడ్- రూ.30 లక్షలు, జీషాన్ అన్సారీ- రూ.40 లక్షలు, జయదేవ్ ఉనద్కత్- రూ. కోటి, కమిందు మెండీస్- రూ.75 లక్షలు ఆరెంజ్ ఆర్మీలో చేరారు.వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ తన కేడర్‌లో పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డిలను ఉంచుకున్న సంగతి తెలిసిందే.

జట్టు కూర్పుపై కోచ్ వెటోరి రియాక్ట్ అయ్యారు. ఇషాన్ వంటి ఆటగాడిని జట్టులోకి తీసుకోవడం గొప్ప విజయంగా అభివర్ణించిన వెటోరి ఇదే సమయంలో భూవనేశ్వర్, నటరాజన్ వంటి ఆటగాళ్లను విడిచిపెట్టడం బాధకరమే అని తెలిపారు.నటరాజన్ జట్టును విడిచిపెట్టడాన్ని అంగీకరించినప్పటికీ, అతను జట్టుకు ఎంత విలువైన ఆటగాడో వెటోరి గుర్తుచేసుకున్నారు.
నటరాజన్ వంటి ఆటగాడిని కోల్పోవడం అనేది తీరలేని నష్టం. అయినప్పటికీ, మేము ఈ రోజు జట్టుకు అవసరమైన మరింత మంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. అయితే మిడిల్ ఆర్డర్‌లో క్లాసెన్‌కు తోడుగా మరో ఆటగాడు లేకపోవడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications