SRH డేంజరస్ ప్లేయర్‌‌కి షాక్ ఇచ్చిన కావ్య పాప..?

సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తన మూడో మ్యాచ్‌కు రెడీ అయింది. ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతానికి భిన్నంగా చాలామంది అభిమానులు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. క్రికెట్ అభిమానులు సైతం ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే సీజన్ తొలి మ్యాచ్‌ను ఘనంగా ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్‌‌ను ఓడించి తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. అయితే ఇదే జోరును సన్ రైజర్స్ హైదరాబాద్ కొనసాగించలేకపోయింది.

Take a Poll

లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది.ప్రత్యర్థి ముందు 191 పరుగుల టఫ్ టార్గెట్ చేసినా దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. సొంత గ్రౌండ్‌లో సన్ రైజర్స్ ఓడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఓపెనర్లు రాణించాల్సి ఉంది.హెడ్, అభిషేక్ శర్మ నుంచి ఇప్పటి వరకు సరైన ఇన్నింగ్స్ రాలేదు. ముఖ్యంగా అభిషేక్ శర్మ తన స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. మరోవైపు తెలుగోడు అయిన నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫెయిల్యూర్స్ కూడా జట్టుకు ఇబ్బందికరంగా మారింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి స్లో బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆడన రెండు మ్యాచ్‌ల్లో నితీష్ కుమార్ రెడ్డి ఫ్లాప్ అయ్యాడు. దీంతో అతని స్థానంలో అధర్వ తైడేను జట్టులోకి తీసుకునే ఆలోచనలో సన్ రైజర్స్ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. తను విదర్భ తరపున దేశీయ క్రికెట్ ఆడుతున్నాడు. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు.

Sunrisers Hyderabad team playing eleven for the match against Delhi

ఇక బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో కూడా సన్ రైజర్స్ కీలక మార్పులు చేయనుందని తెలుస్తోంది. 190 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ బౌలర్లు కాపాడలేకపోయారు.నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో హైదరాబాద్ బౌలింగ్‌ను తునాతునకలు చేశారు. ఈ పరాజయంతో హైదరాబాద్ టీం తమ బౌలింగ్ విభాగంలో మార్పులు చేసుకోవాలని భావిస్తోంది. సిమర్జిత్ సింగ్ స్థానంలో రాహుల్ చాహర్‌ను జట్టులోకి తీసుకునే ఆలోచన ఉంది. అటు, ఆడమ్ జంపా స్థానంలో కామిందు మెండీస్‌ను కూడా ఎంపిక చేసే అవకాశముంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్/సచిన్ బేబీ/అథర్వ టైడ్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, సిమర్జిత్ సింగ్/రాహుల్ చాహర్, మహమ్మద్ షమీ

ఇంపాక్ట్ ప్లేయర్: ఆడమ్ జంపా/ కామిందు మెండీస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+