ఆ నలుగురు లెఫ్ట్ హ్యాండర్లు చూసుకోవాల్సిందే: ఇంకా కొరుకుపడని పాకిస్తాన్ మిస్టరీ బౌలర్
ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాదిమంది ఎదురుచూస్తూ వస్తోన్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నేడే. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆర్క్ రైవల్స్ భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. శ్రీలంక దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. దీనికోసం రెండు జట్లూ ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోన్నాయి. పాకిస్తాన్ జట్టు పరిస్థితెలా ఉన్నప్పటికీ.. టీమిండియా మాత్రం ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతోంది.
టీమిండియా ఎదుర్కొంటోన్న మరో సవాల్.. పాకిస్తాన్ మిస్టరీ బౌలర్ ఉస్మాన్ తారిక్. ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది. అతని రన్ అప్ సాధారణంగా ఉన్నప్పటికీ, బంతిని విసిరే ముందు రెండు సెకన్ల పాటు అకస్మాత్తుగా ఆగిపోతాడు. సైడ్ ఆర్మ్ తరహా స్లింగింగ్ స్టైల్‌లో ఆఫ్ బ్రేక్ బాల్ వేస్తాడు. ఇప్పటివరకు ఎప్పుడూ అతని బౌలింగ్ ను ఎదుర్కొనలేదు టీమిండియా. ఏ ఒక్క బ్యాటర్ కు కూడా అతన్ని ఎదుర్కొన్న అనుభవం లేకపోవడం ఇబ్బందికరంగా పరిణమించింది.

ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్, టీ20ల్లో అతనికి ఉన్న ట్రాక్ రికార్డ్ నేపథ్యంలో నెట్ ప్రాక్టీస్ లో స్పిన్ బౌలింగ్ కు ప్రాధాన్యత ఇస్తోంది టీమిండియా. స్పిన్ బౌలింగ్ ను ఎక్కువగా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలర్ గా అవతారం ఎత్తాడు. సరదాకే అయినప్పటికీ- ఉస్మాన్ తారిక్ తరహాలో బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అతని బౌలింగ్ యాక్షన్ ను అనుకరించాడు. అచ్చం అతనిలాగానే స్టాప్ అండ్ స్టార్ట్ స్పిన్, సైడ్ ఆర్మ్ యాక్షన్‌ను అనుకరించాడు. నెట్స్ లో బంతులు వేశాడు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లకు ఉస్మాన్ తారిఖ్ శైలిలో బౌలింగ్ చేస్తూ కనిపించాడు సూర్యకుమార్ యాదవ్. ఇది వారికి తారిఖ్ బౌలింగ్‌లోని వైవిధ్యాలను అర్థం చేసుకోవడానికి, అసాధారణ డెలివరీలకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడానికి, అతని బౌలింగ్ యాక్షన్ కు అలవాటు పడటానికీ సహాయపడినట్టవుతుంది.
అంతకుముందు నమీబియా కేప్టెన్ బౌలర్ గెరార్డ్ ఎరాస్మస్ విషయంలో పూర్తిగా చేతులెత్తేశారు భారత బ్యాటర్లు. సైడ్ ఆర్మ విధానంలో అతను వేసిన బంతులకు బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. పరుగులు తీయడానికి కష్టపడటం ఒక ఎత్తయితే.. ఏకంగా నలుగురు బ్యాటర్లు అవుట్ కావడం మరో ఎత్తు. ఆ మ్యాచ్ లో తన నాలుగు ఓవర్ల కోటాలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు ఎరాస్మస్.
అసాధారణమైన సైడ్ ఆర్మ్ యాక్షన్‌ను ఎరాస్మస్ ఉపయోగించినప్పుడు భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు అలాంటి సైడ్ ఆర్మ్ బౌలింగ్ ను విభిన్నంగా వేసే ఉస్మాన్ తారిఖ్ అసాధారణ బౌలింగ్ నుండి భారత బ్యాటర్లకు తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. అతని బౌలింగ్‌లోని పాజ్, రిలీజ్ ఇప్పటికే బ్యాటర్ల రిథమ్‌ను దెబ్బతీసిందనేది అతనికి పడ్డ వికెట్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. వారి టైమింగ్‌ను డిస్టర్బ్ చేస్తూ, భారత టాప్ ఆర్డర్‌కు సవాలు విసిరే అవకాశం ఉంది.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications