Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వర్షంలో సూపర్-8 మ్యాచ్ కొట్టుకుపోతే ఏమవుతుంది, కొత్త నిబంధనలు..!!

T20 World cup: టీ20 ప్రపంచ కప్ లో కీలక దశ.. అసలైన సమరం మొదలైంది. లీగ్ మ్యాచులు పూర్తయి.. సూపర్ -8 పోరు ప్రారంభం అవుతోంది. కీలక పోరుకు టీమిండియాతో సహా ప్రధాన జట్లు సిద్దం అవుతున్నాయి. సూపర్ -8 లో రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు సెమీస్ అవకాశం దక్కుతుంది. అయితే.. ఇక్కడ ప్రతీ టీం కు ప్రతీ మ్యాచ్ కీలకంగా మారుతున్న వేళ.. వాతావరణం సైతం పరీక్షగా మారుతోంది. దీంతో.. సూపర్ -8 మ్యాచుల్లో వర్షం తో అంతరాయం కలిగినా.. మ్యాచు రద్దయినా ఏం జరుగుతుందనేది ఐసీసీ తాజా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

టీ20 ప్రపంచ కప్ లో సూపర్ -8 మ్యాచులు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ మ్యాచులు ప్రారంభానికి ముందు ప్రధాన జట్ల పైన భారీ అంచనాలు ఉన్నాయి. టీమిండియా సూపర్ -8 లో మూడు మ్యాచులు ఆడనుంది. ఈ సమయంలోనే సూపర్ -8 ప్రారంభం వేళ వర్షం భయం వెంటాడుతోంది. భారత్ లో జరిగే మ్యాచులకు ఇబ్బంది కనిపించకపోయినా.. కొలొంబోలో జరిగే మ్యాచులకు మాత్రం వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తాజా అంచనాలతో స్పష్టం అవుతోంది.

t20-world-cup-in-case-of-a-rain-washout-in-super-8-matches-what-will-be-the-result-as-icc-latest-g

సూపర -8 దశలో రెండు గ్రూపులుగా ఉన్న భారత్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి. ప్రతి గ్రూప్‌లోని జట్లు పరస్పరం ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ప్రతి గ్రూప్‌లో టాప్ 2 జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి. అయితే, లీగ్ మ్యాచుల తరహాలోనే ఈ సూపర్ -8 మ్యాచులు భారత్ - శ్రీలంకలో నిర్వహించేలా షెడ్యూల్ ఫిక్స్ అయింది.

ICC నిబంధనలు ఏం చెబుతున్నాయి

కాగా, వర్షం భయం వెంటాడుతున్న సమయంలో మ్యాచ్ కు అంతరాయం కలిగితే ఏ జట్టు నష్ట పోవాల్సి వస్తుందనే ఆందోళన కనిపిస్తోంది. అయితే, సూపర్ 8 మ్యాచ్‌లకు గ్రూప్ స్టేజ్‌లాగే రిజర్వ్ డే ఇవ్వలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం టీ20 మ్యాచ్‌లో ఫలితం రావాలంటే రెండు జట్లు కనీసం 5-5 ఓవర్లు ఆడాల్సిందే. అందువల్ల అంపైర్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ నిర్వహించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తారు.

అయినా.. వర్షం కారణంగా కనీసం 5 ఓవర్లు కూడా ఆడలేని పరిస్థితి వస్తే మ్యాచ్‌ను రద్దు చేసినట్లుగా పరిగణిస్తారు. అప్పుడు ఇరు జట్లకు చెరో ఒక్క పాయింట్ ఇవ్వబడుతుంది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లకు సమానంగా పాయింట్లు చేరతాయి. ఇదే ఇప్పుడు సూపర్ -8 కు చేరిన జట్లలో ఆందోళనకు కారణంగా మారుతోంది. ఇది సెమీఫైనల్ రేసులో నష్టం కలిగించే అవకాశం ఉంది. దీంతో.. మ్యాచ్ తో పాటుగా వాతావరణ రిపోర్టు సూపర్ -8 లో కీలకంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+