T20 World Cup: భవిష్యత్తులో ఏ టోర్నీల్లోనూ ఆడనివ్వం-పాక్ కు ఐసీసీ వార్నింగ్..!

మరికొన్ని వారాల్లో ప్రారంభం కాబోతున్న టీ20 వరల్డ్ కప్ (t20 world cup) పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ నుంచి బహిష్కరించిన తర్వాత ఆ దేశం భారత్ లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోమని భీష్మించింది. దీంతో ఐసీసీ బంగ్లాదేశ్ ను టీ20 వరల్డ్ కప్ నుంచి బహిష్కరించింది. దీంతో బంగ్లాదేశ్ కు మద్దతుగా తాము కూడా వరల్డ్ కప్ ను బాయ్ కాట్ చేసే అవకాశం ఉన్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహసిన్ నక్వీ ప్రకటించారు. దీనిపై ఐసీసీ తీవ్రంగా స్పందించింది.

భారత్ లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ పై నిన్న ఐసీసీ వేటు వేసింది. బంగ్లాదేశ్ స్ధానంలో స్కాట్లండ్ కు ఈ టోర్నీలో ఆడే అవకాశం కల్పించింది. ఐసీసీ నిర్ణయం వెలువడగానే దీనిపై పాకిస్తాన్ క్రికెట బోర్డు తీవ్రంగా స్పందించింది. బంగ్లాదేశ్ కు ఐసీసీ తీవ్ర అన్యాయం చేసిందని, ఆ దేశానికి మద్దతుగా తాము టోర్నీని బాయ్ కాట్ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పీసీబీ ఛీఫ్ మొహసిన్ నక్వీ తెలిపారు. తమ ప్రధాని దేశం బయట ఉన్నారని, ఆయన రాగానే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ వ్యాఖ్యలు ఐసీసీకి మంటపుట్టించాయి.

T20 World Cup Standoff ICC Threatens Pakistan with Complete No Series Ban and NOC Withholding

పాకిస్తాన్ మ్యాచ్ లకు హైబ్రిడ్ మోడల్ విధానం అమలు చేస్తున్న ఐసీసీ.. ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్ లో ఆడకపోతే టోర్నీ నుంచి బహిష్కరించడం ద్వారా ద్వంద ప్రమాణాలు అనుసరిస్తోందని నక్వీ ఆరోపించారు. దీనిపై ఐసీసీ తీవ్ర చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో పాకిస్తాన్ ను భవిష్యత్తులో ఏ టోర్నీల్లోనూ ఆడకుండా నిషేధం విధించడం, పాకిస్తాన్ ఏ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడకుండా చేయడం, ఆసియాకప్ నుంచి కూడా తప్పించడం వంటి చర్యలు ఉన్నట్లు సమాచారం. అలాగే పాకిస్తాన్ లీగ్ లో ఇతర దేశాల క్రికెటర్లు ఆడేందుకు ఎన్వోసీలు ఇవ్వకుండా చేయడాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

T20 World Cup Standoff ICC Threatens Pakistan with Complete No Series Ban and NOC Withholding

ఈ ఆంక్షలతో పీసీబీ ఆదాయ మార్గాలను దెబ్బతీయడమే కాకుండా పాకిస్తాన్ దేశీయ క్రికెట్ వాణిజ్య విలువను కూడా దెబ్బతీసేలా ఐసీసీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న పీసీబీ ఛీఫ్ మొహసిన్ నక్వీ.. బంగ్లాకు మద్దతుగా మిగిలిన జట్లు కూడా టీ20 వరల్డ్ కప్ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీనిపైనా ఐసీసీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అధికారిక నిర్ణయం వెలువడగానే తమ చర్యలు ప్రకటించేందుకు ఐసీసీ సిద్దమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+