Team India: గురువారం ఇండియాకు భారత జట్టు.. ముంబైలో విక్టరీ పరేడ్..

టీమిండియా దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 2007 ధోని నాయకత్వంలో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత్ ఇప్పుడు మళ్లీ కప్ సాధించింది. జూన్ 29 జరిగిన ఫైనాల్లో సౌతాఫ్రికాను మట్టికరిపించిన భారత్ పొట్టి కప్ ను ఎగురేసుకెళ్లింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కీలక బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా జట్టు ఇంకా వెస్టిండీస్ లోని బార్బడోస్ లోనే ఉంది.

అక్కడ తుఫాన్ రావడంతో ఎయిర్ పోర్టు మూసివేశారు. దీంతో భారత ఆటగాళ్లు హోటళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. భారత జట్టు కొన్ని గంటల క్రితమే బార్బడోస్ నుంచి బయల్దేరింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో భారత జట్టు ఇండియాకు చేరుకోనుంది. గురువారం ఉదయం 6 గంటల కల్లా టీమిండియా ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టుకు చేరుకోనుంది. జట్టు సభ్యులు విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లనున్నారు.

The Indian team will participate in the victory parade in Mumbai on Thursday evening

అనంతరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి ముంబైకి వెళ్తారు. ముంబైలో విక్టరీ పరేడ్ లో పాల్గొంటారు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన సందర్భంగా బీసీసీఐ ముంబైలో విక్టరీ పరేడ్ ఏర్పాటు చేసింది. ఈ విజయోత్సవ ర్యాలీ ముంబైలోని మెరైన్ డ్రైవ్ నుంచి ప్రారంభమై వాంఖడే స్టేడియం వరకు కొనసాగనుంది. గురువారం సాయంత్రం 5:00 గంటలకు ఈ విక్టరీ పరేడ్‌ ప్రారంభం కానుందని బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ చేశారు. విక్టరీ వేడుకలో అభిమానులు పాల్గొనాలని కోరారు.

"టీమిండియా టీ20 ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించే విక్టరీ పరేడ్‌లో మాతో చేరండి! మాతో జరుపుకోవడానికి జూలై 4న సాయంత్రం 5:00 గంటలకు మెరైన్ డ్రైవ్ నుండి వాంఖడే స్టేడియం వరకూ పయనించండి! తేది గుర్తుంచుకోండి!" అని జై షా ట్వీట్ చేశారు. టీమిండియా విక్టరీ పరేడ్ లో పాల్గొనేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. విక్టరీ పరేడ్ ను ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+