Virat Kohli: కివీస్ తో సిరీస్ లో విరాట్ కు అరుదైన అవకాశం - కొత్త చరిత్ర..!!
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి అరుదైన అవకాశం. 2026 కోహ్లీ కెరీర్ లో కొత్త చరిత్ర లిఖించనుంది. 2025 సంవత్సరం కోహ్లీకి ఒక చిరస్మరణీయమైనది. ఐపీఎల్ సీజన్18లో అతను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ కప్ ను ముద్దాడాలనే ఆర్సీబీ ఏళ్ల కల.. 2025లో నెరవేరింది. ఇక.. 2026 లో కోహ్లీని కొత్త రికార్డులు ఊరిస్తున్నాయి. ఫ్యాన్స్ లో సైతం అంచనాలు పెరిగిపోతున్నాయి. దీంతో.. కోహ్లీ తిరుగులేని రికార్డుల వైపు దూసుకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు.
విరాట్ భారత్ తరఫున వన్డేలలో అత్యధిక పరుగులతో సీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటర్లలో రెండవ స్థానంలో నిలిచాడు. ఒకే అంతర్జాతీయ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం వంటి ఘనతలు కూడా 2025 ఏడాదిలో సాధించాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో (IPL) మరో 339 పరుగులు చేస్తే.. ఈ లీగ్‌లో 9,000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. ప్రస్తుతం విరాట్ ఐపీఎల్ లో 259 ఇన్నింగ్స్‌ల్లో 8,681 పరుగులు చేసి.. టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

అతడి తర్వాత రోహిత్ శర్మ 267 ఇన్నింగ్స్‌ల్లో 7,046 రన్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా కోహ్లీ వన్డేల్లో మరో 443 పరుగులు చేస్తే 15,000 మైలురాయి చేరుకుంటాడు. ప్రస్తుతం 296 ఇన్నింగ్స్‌ల్లో 14,557 పరుగులు చేశాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ టాప్ ప్లేస్ లో ఉన్నారు.
సచిన్ 452 ఇన్నింగ్స్‌ల్లో 18,426 పరుగులు చేశాడు. ఇప్పటివరకు సచిన్ ఒక్కరే వన్డేల్లో 15,000కు పైగా పరుగులు చేశారు. న్యూజిలాండ్, టీమిండియా మధ్య జనవరి 11న తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఓ రికార్డ్ సృష్టించే ఛాన్స్ ఉంది. విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 623 ఇన్నింగ్స్‌ల్లో 27,975 పరుగులు చేశాడు. మరో 42 పరుగులు చేస్తే.. శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కరను (28,016 పరుగులు) అధిగమిస్తాడు. అప్పుడు కోహ్లీ ఇంటర్నెషనల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డ్ సృష్టిస్తాడు.
తొలి స్థానంలో సచిన్ టెండుల్కర్ 34,357 పరుగులతో టాప్ లో ఉన్నారు. 2027 ప్రపంచ కప్ లో విరాట్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కోహ్లీ లక్ష్యం 2027 ప్రపంచ కప్ అవ్వాలని ఆశిస్తున్నారు. అయితే, 2027 వన్డే ప్రపంచ కప్ ఆడే జట్టులో స్థానం నిలబెట్టుకునేందుకు అతను కాలంతో పోటీ పడాల్సి వస్తోంది. దీంతో.. 2026 లో కోహ్లీ ఆడే మ్యాచ్ లు.. సాధించే రికార్డుల కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications