వీకెండ్ ధమాకా: ప్రపంచ కప్‌లో డబుల్ హెడ్డర్స్

న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ 2023 రసవత్తరంగా కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, మలి మ్యాచ్‌లో పాకిస్తాన్ తిరుగులేని విజయాలను సాధించాయి. భారీ తేడాతో తమ ప్రత్యర్థులను మట్టికరిపించాయి. ఫైనల్స్ వైపునకు పరుగు మొదలు పెట్టాయి. భారత్- ఈ ఆదివారం తన తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఆస్ట్రేలియాతో తలపడనుంది.

నేడు- క్రికెట్ ఫ్యాన్స్‌కు వీకెండ్ ధమాకా దొరికింది. ప్రపంచ కప్ 2023లో భాగంగా డబుల్ హెడ్డర్స్ షెడ్యూల్ అయ్యాయి. రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. అభిమానులను ఉర్రూతలూగించనున్నాయి. అందులో ఒకటి డే మ్యాచ్. సుదీర్ఘ విరామం అనంతరం డే మ్యాచ్‌ను చూసే అవకాశం లభించినట్టయింది.

Today match in World cup 2023: Afghanistan will take Bangladesh and South Africa face Sri Lanka

తొలి మ్యాచ్ ఈ ఉదయం 10: 30 గంటలకు ఆరంభమౌతుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఇందులో ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఇదే డే మ్యాచ్. బంగ్లాదేశ్ జట్టులో అయిదు కొత్త ముఖాలతో వరల్డ్ కప్‌లో ఆడబోతోండటం ఆసక్తి రేపుతోంది.

అండర్ 19 మ్యాచ్‌లను ఆడిన అయిదుమంది యంగ్ ప్లేయర్లతో బరిలోకి దిగిందా జట్టు. తౌహీద్ హృదోయ్, షొరిఫుల్ ఇస్లాం, తన్జీద్ హసన్, తన్జీం హసన్‌.. వరల్డ్ కప్‌లో తొలిసారిగా ఆడబోతోన్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. వరల్డ్ కప్‌లో తాను ఎదుర్కొన్న తొలి మ్యాచ్‌లను గెలవడాన్ని ఆనవాయితీగా పెట్టుకుంది బంగ్లాదేశ్.

2015లో ఆఫ్ఘనిస్తాన్, 2019లో దక్షిణాఫ్రికా జట్లను ఓడించిందా టీమ్. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మరోసారి ఈ మెగా ఈవెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఎదుర్కొనబోతోంది. దీనికోసం అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంది. అవి ఎంతవరకు సఫలమౌతాయనేది ఈ సాయంత్రానికి స్పష్టమౌతుంది.

మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా.. శ్రీలంకను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ ఈ మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం దీనికి వేదిక. ఆసియా కప్ 2023 ఫైనల్‌కు చేరిన ఊపులో ఉంది శ్రీలంక. తనకంటే బలమైన దక్షిణాఫ్రికాతో తలపడటానికి సమాయాత్తమౌతోంది.

దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో కొంత ఆందోళనకరం. ఎన్రిచ్ నోర్ట్జే, సిసాండా మగాలా గాయాల బారిన పడ్డారు. ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగారు. స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో కేశవ్ మహారాజ్, తబ్రెజ్ షామ్సీ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఆల్ రౌండర్లతో జట్టు నిండి ఉన్నందున బౌలింగ్ విభాగం గురించి పెద్దగా ఆందోళన పడట్లేదా జట్టు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+