స్మృతి మంధాన ఫొటో లీక్ ..!
మహిళల క్రికెట్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన గురించి గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టీ20 ప్రపంచకప్ 2025 టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మంధాన విధ్వంసం సృష్టించి, ఎట్టకేలకు తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మంధాన 66 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో ఏకంగా 80 పరుగులు చేసి అదరగొట్టింది.
ఈ మ్యాచ్‌లో మంధాన కేవలం పరుగులు చేయడమే కాదు, పలు సంచలన రికార్డులను కూడా తన పేరిట లిఖించుకుంది.ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 1000 వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా ఆమె నిలిచింది. వన్డేల్లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై ఐదు 50 ప్లస్ స్కోర్లు చేసిన తొలి బ్యాటర్‌గానూ రికార్డ్ సాధించింది.మంధాన అద్భుతంగా రాణించినప్పటికీ, టీమిండియా పేలవ బౌలింగ్ కారణంగా 331 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఇదిలా ఉంటే తాజాగా స్మృతి మంధానకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో స్మృతి మంధానకు సిక్స్ ప్యాక్ ఉందని కొందరు నెటిజన్లు వైరల్ చేశారు. ప్రాక్టీస్ సెషన్‌లో అలిసిపోయిన మంధాన తన టీషర్ట్‌ను పైకెత్తి ముఖం తుడుచుకుంటున్నట్లుగా ఉన్న ఈ ఫొటోలో ఆమె 'ఆబ్స్' స్పష్టంగా కనిపిస్తున్నాయని పోస్టులు వెల్లువెత్తాయి.
అయితే, ఈ ఫొటోపై వాస్తవాల పరిశీలన చేయగా, ఇది ఫేక్ ఫొటో అని తేలింది. ఈ చిత్రం AI జనరేటెడ్ లేదా ఎడిటింగ్ ద్వారా సృష్టించబడినదని స్పష్టంగా అర్థమవుతోంది. 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ఏఐ ప్లాట్‌ఫామ్ 'గ్రోక్' కూడా ఇది ఫేక్ ఫొటో అని నిర్ధారించింది. మంధాన ఇంతవరకు తన సిక్స్ ప్యాక్‌కు సంబంధించిన ఎలాంటి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోలేదని వెల్లడైంది.
స్మృతి మంధాన మహిళల క్రికెట్‌లో అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్లలో ఒకరనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఆమెకు సిక్స్ ప్యాక్ ఉండే అవకాశం కూడా ఉంది. కానీ, కొందరు ఆకతాయిలు, ఆమెకున్న 'బ్యూటీ క్రికెటర్' ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఉపయోగించుకుని ఇలాంటి ఫేక్ పిక్చర్స్‌ను సృష్టించి వైరల్ చేస్తున్నారని స్పష్టమవుతోంది. క్రికెట్ అభిమానులు, సాధారణ ప్రేక్షకులు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని కోరడమైనది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications