రూ. 40 కోట్లు + కేప్టెన్సీ ఇస్తేనే ఉంటాం: ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్ల రచ్చ

ఐపీఎల్ వేలం వ్యూహాల్లో నూతన రగడ మొదలైంది. మెగా వేలానికి ముందే ఫ్రాంచైజీల యాజమాన్యాలకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. లీగ్ లోని ఇద్దరు స్టార్ క్రికెటర్లు తమను రిటైన్ చేసుకోవాలంటే ఏకంగా రూ. 40 కోట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టినట్టు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరు రూ. 40 కోట్ల శాలరీతో పాటు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా తనకే అప్పగించాలని షరతు విధించినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు ప్లేయర్లు, ఫ్రాంఛైజీ వివరాలు బయటికి రావట్లేదు. దీనిపై క్రిక్‌బజ్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం రిటెన్షన్ వివరాలను సమర్పించడానికి ఈ నెల 17వ తేదీ వరకు గడువు ఉంది. ఆ తర్వాత డిసెంబర్ 16న గోవా వేదికగా ఈ మినీ వేలం జరగనుంది. ఈ సీజన్ ముగిసిన వెంటనే 2028 కోసం భారీ స్థాయిలో మెగా ఆక్షన్ జరగనుంది. దీంతో తదుపరి సైకిల్ ప్రారంభానికి ముందే పలువురు ప్లేయర్లు తమ శాలరీని రెట్టింపు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటినుంచే ఫ్రాంఛైజీ యాజమాన్యాలపై ఒత్తిడి పెంచుతున్నారు.

Two Top tier players in IPL have Reportedly quoted Rs 40 crore their desired retention fee auction

ఈ క్రమంలోనే ఈ తాజా ప్రతిపాదన తెరమీదికి వచ్చినట్లు క్రిక్ బజ్ పేర్కొంది. క్రికెటర్లు రూ. 40 కోట్లు కోరడం వెనుక 2025 సీజన్ లో నిర్వహించిన మెగా వేలంలో నమోదైన ధరలే ప్రధాన కారణమనే అంచనాలు ఉన్నాయి. గత వేలంలో పాత ఫ్రాంచైజీ రిటెన్షన్ ఆఫర్‌ను కాదని వేలంలోకి వచ్చిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ రూ. 27 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.

బెంగళూరు- కెంపెగౌడ ఎయిర్ పోర్ట్ రూట్ లో భారీగా ట్రాఫిక్ డైవర్షన్: 18 నెలల పాటు అమలు
బెంగళూరు- కెంపెగౌడ ఎయిర్ పోర్ట్ రూట్ లో భారీగా ట్రాఫిక్ డైవర్షన్: 18 నెలల పాటు అమలు

స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇవే కాకుండా విదేశీ ప్లేయర్లు హెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లు, నికోలస్ పూరన్- రూ. 21 కోట్లకు రిటైన్ అయ్యారు. గతంలో బీసీసీఐ నిర్ణయించిన రిటెన్షన్ స్లాబ్‌ రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ.11 కోట్ల కంటే మినీ ఆక్షన్ లో లభించే మొత్తం చాలా ఎక్కువగా ఉంటోందనే విషయాన్ని ఇది నిరూపించినట్టయింది. దీంతో తమ సామర్థ్యానికి తగ్గ ప్రతిఫలం దక్కాలంటే పెద్ద మొత్తంలో డిమాండ్ చేయడమే సరైన మార్గమని ప్లేయర్లు భావిస్తున్నారు.

బెంగళూరులో అత్త వారింట్లో ఏడుమందిని గ్రైండింగ్ స్టోన్ తో మట్టుబెట్టిన క్యాబ్ డ్రైవర్
బెంగళూరులో అత్త వారింట్లో ఏడుమందిని గ్రైండింగ్ స్టోన్ తో మట్టుబెట్టిన క్యాబ్ డ్రైవర్

ఒక్కరికే రూ. 40 కోట్లను చెల్లించాల్పి వస్తే ఫ్రాంచైజీల పర్స్ బ్యాలెన్స్ దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలం నాటికి ప్రతి ఫ్రాంచైజీ వద్ద రూ. 120 కోట్ల పర్స్ పరిమితి ఉండేది. ఐపీఎల్ 2027 నాటికి ఇది రూ. 130 కోట్లకు పెరుగనుంది. 2028 మెగా వేలం సమయానికి మొత్తం పర్స్ దాదాపు రూ.150 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ఒకవేళ రూ.150 కోట్ల అంచనా బడ్జెట్‌లో ఒకే ఒక్క ఆటగాడికి రూ. 40 కోట్లు ఇస్తే, అది మొత్తం జట్టు పర్స్‌లో దాదాపు 26 శాతానికి పైగా అవుతుంది. మిగిలిన ప్లేయర్లను కొనడంలో ఇబ్బందులు రావొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+