Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నీ ఏజ్ ఏంటీ.. ఆ షాట్లేంటీ: చిచ్చరపిడుగు సునామీ బ్యాటింగ్.. !!

ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ చెలరేగాడు. జింబాబ్వే హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడీ.. 14 సంవత్సరాల బీహార్ కుర్ర సంచలనం. 55 బంతుల్లోనే శతకం సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత మరింత చెలరేగాడు. 80 బంతుల్లో 175 పరుగులను పిండుకున్నాడు. లంప్స్ డెన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

15 భారీ సిక్సర్లు, 15 బుల్లెట్ల వంటి ఫోర్లు అతని ఇన్నింగ్ లో నమోదయ్యాయి. అండర్ 19 ప్రపంచ కప్ చరిత్రలో ఏ భారత బ్యాటర్ చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీ ఇది. గతంలో 2022లో ఉగాండాపై రాజ్ అంగద్ బావా 69 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును సూర్యవంశీ అధిగమించాడు. అండర్ 19 ప్రపంచ కప్ మ్యాచ్‌లో 60 బంతుల్లోపు శతకం సాధించిన తొలి భారత బ్యాటర్‌గా కూడా నిలిచాడు.

Unstoppable Vaibha Suryavanshi Smashes Fastest Century in U19 World Cup Against England in Harare

మొత్తం టోర్నమెంట్ రికార్డుల్లో సూర్యవంశీ ఈ ప్రపంచ కప్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన శతకం సాధించిన వీరుడిగా రికార్డు నెలకొల్పాడు. 2022లో శ్రీలంకపై 63 బంతుల్లో శతకం బాదాడు. పాకిస్తాన్ కు చెందిన ఖాసిం అక్రమ్‌ నెలకొల్పిన రికార్డును తుత్తునీయలు చేశాడు. 2026 ఎడిషన్‌లో జపాన్‌పై 51 బంతుల్లోనే శతకం చేసిన ఆస్ట్రేలియా విల్ మలైజ్‌చుక్ అగ్రస్థానంలో ఉన్నాడు. అండర్ 19 ప్రపంచ కప్‌లో వేగవంతమైన సెంచరీల జాబితా ఇదీ..

విల్ మలైజ్‌చుక్- ఆస్ట్రేలియా: జపాన్‌పై 51 బంతుల్లో సెంచరీ సాధించాడు.

వైభవ్ సూర్యవంశీ- భారత్: ఇంగ్లాండ్‌పై 55 బంతులు

ఖాసిం అక్రమ్-పాకిస్తాన్- శ్రీలంకపై 63 బంతుల్లో

బెన్ మేయెస్- ఇంగ్లాండ్: స్కాట్లాండ్‌పై 65 బంతుల్లో

రాజ్ బావా- భారత్: ఉగాండాపై 69 బంతుల్లో సెంచరీలు నమోదు చేశారు.

దీంతో పాటు సూర్యవంశీ 71 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు. అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడు ఇతనే. ఈ ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో అతను ఇప్పటివరకు 23 సిక్సర్లు బాదాడు. 2022లో దక్షిణాఫ్రికాకు చెందిన డెవాల్డ్ బ్రెవిస్ సాధించిన 18 సిక్సర్ల మార్కును అధిగమించాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+