Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్

ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. యాషెస్ లో భాగంగా ఇంగ్లాండ్‌తో సిడ్నీలో జరిగే టెస్ట్ మ్యాచ్ అనంతరం క్రికెట్ నుంచి శాశ్వతంగా వైదొలగనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు ఖవాజా. ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాల జాబితాలో ఖవాజా చేరనున్నాడు.

ఇంగ్లాండ్‌తో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే అయిదో టెస్ట్ తన చివరి మ్యాచ్ అని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. 2011లో సిడ్నీలో ఇంగ్లాండ్ పైనే ఖవాజా తన టెస్ట్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు అదే సిడ్నీలో అదే ఇంగ్లాండ్ తో తన కేరీర్ కు ముగింపు పలికాడు. తన రిటైర్మెంట్ నిర్ణయంపై కుటుంబ సభ్యులతో చర్చించానని, ఒకరోజు ముందే జట్టు సహచరులకు ఈ విషయాన్ని తెలియజేశానని చెప్పాడు.

Usman Khawaja announces retirement after Sydney Test

కెరీర్‌లో ఎదుర్కొన్న వివక్ష గురించి ఖవాజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. చాలాసార్లు టార్గెట్ అయ్యానని, అలా ఎందుకు చేస్తున్నారో కూడా తనకు తెలుసునని అన్నాడు. క్రికెట్ వెలుపల విషయాల గురించి మాట్లాడటం ఇప్పుడు సరైన సమయం కాదని వ్యాఖ్యానించాడు. ఫామ్ కోల్పోవడం, జట్టుకు ఎంపిక కాకపోవడం వంటి అంశాలపై స్పందించాడు ఖవాజా. కొన్ని విమర్శలు తనను ఎంతగా బాధించాయో వివరించాడు.

"సాధారణంగా ఎవరైనా గాయపడితే వారి పట్ల జాలిపడతారు. 'పాపం జోష్ హేజిల్‌వుడ్' లేదా 'పాపం నాథన్ లియోన్' అని అంటారు.. తాను గాయపడ్డప్పుడు అలాంటి ఓదార్పు నాకు దక్కలేదు. అందరూ నా విశ్వసనీయతను ప్రశ్నించారు. అదే నన్ను అత్యంత బాధించింది. చాలాకాలంగా ఇటువంటి వివక్షపూరక పరిస్థితులు, వాతావరణంతోనే జీవిస్తున్నాను.. అని ఖవాజా ఆవేదన వ్యక్తం చేశాడు.

పాకిస్తాన్‌లో జన్మించిన ఖవాజా ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన తొలి ముస్లిం క్రికెటర్. టెస్ట్, వన్డేల్లో ఖవాజా యావరేజ్ 25.93, 36.11. 2025లో అతను 18 ఇన్నింగ్స్‌లలో 614 పరుగులు చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీలంకపై డబుల్ సెంచరీ బాదాడు. 232 పరుగులతో సత్తా చాటాడు. ఖవాజా మొత్తం 87 టెస్టులు, 40 వన్డేలు, 9 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడి 8,001 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+