వైభవ్ 'సూర్య' తాండవం.. ఉత్కంఠపోరులో భారత్ ఘనవిజయం

U19 World Cup 2026: జింబాబ్వేలోని బులవాయో వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత అండర్-19 జట్టు బంగ్లాదేశ్‌ను డీఎల్ఎస్ పద్ధతిలో 18 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో ప్రస్తుత టోర్నమెంట్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

బ్యాటింగ్‌లో వైభవ్, అభిజ్ఞాన్ మెరుపులు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కేవలం 12 పరుగులకే కెప్టెన్ ఆయుష్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0) వికెట్లను కోల్పోయింది. అయితే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మొత్తం 72 పరుగులు (67 బంతులు, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిజ్ఞాన్ కుందు 112 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ తన ఇన్నింగ్స్‌లో 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్ అల్ ఫహద్ 5 వికెట్లతో చెలరేగాడు.

Vaibhav Suryavanshi Stormy Knock Powers India to Thrilling Win Against Bangladesh

బౌలింగ్‌లో విహాన్ మల్హోత్రా వీరవిహారం
వర్షం కారణంగా బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 29 ఓవర్లలో 165 పరుగులుగా సవరించారు. ఛేజింగ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ అజీజుల్ హకీమ్ తమీమ్ (51) పోరాడినప్పటికీ, భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు.విహాన్ మల్హోత్రా బ్యాటింగ్‌లో రాణించలేకపోయినా, బౌలింగ్‌లో మాత్రం సత్తా చాటాడు. కీలకమైన 4 వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. ఖిలన్ పటేల్ రెండు కీలక వికెట్లు తీసి విహాన్‌కు చక్కని సహకారం అందించాడు. చివరికి బంగ్లాదేశ్ 146 పరుగులకే కుప్పకూలడంతో భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+