పంజాబ్ ఆటగాడికి లిప్ లాక్ ఇచ్చిన ప్రీతి జింటా

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దాని వల్ల కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను కలుసుకున్నట్టు AI ద్వారా చిత్రీకరిస్తున్నారు. క్రికెటర్ షమీ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు AI ద్వారా పెళ్లి చేశారు. అలాగే హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలకు పెళ్లి చేసి, పిల్లల్ని కూడా కన్నట్టుగా AI ద్వారా చూపించారు. చాలామంది సెలబ్రిటీలు AIకి బాధితులుగా మారుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా కూడా చేరారు.

తాజాగా సోషల్ మీడియాలో ప్రీతి జింటాకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రీతి జింటా పంజాబ్ కెప్టెన్ అయ్యార్‌కు లిప్ లాక్ ఇచ్చినట్టుగా చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వీడియోలు క్రియేట్ చేయడానికి సిగ్గుడాలంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లై, ఇద్దరు పిల్లలున్న మహిళను ఇలా చిత్రీకరిస్తారా అంటూ వారు ఫైర్ అవుతున్నారు. సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు.ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Video of Preity Zinta kissing Punjab player filmed by AI

ఇక ప్రీతి జింటా విషయానికి వస్తే.. ప్రీతి జింటా సైతం పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌ల్లో సందడి చేస్తుంటారు. పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి జింటా సహ యజమానిగా కొనసాగుతున్నారు.ప్రీతి జింటా జట్టు మ్యాచ్‌లలో తరచుగా కనిపిస్తూ, జట్టును ఉత్సాహపరుస్తూ ఉంటారు..ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు అదరగొడుతుంది.ప్రీతి జింటా వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె 2016లో అమెరికన్ వ్యాపారవేత్త జీన్ గుడ్‌ఎనఫ్‌ను వివాహం చేసుకున్నారు. దంపతులకు 2021లో సరోగసీ ద్వారా కవల పిల్లలు జన్మించారు. వీరికి ఒక బాబు (జై) , ఒక పాప (జియా) ఉన్నారు.ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో లాస్ ఏంజెలెస్‌లో నివసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+