తండ్రయిన విరాట్: జూనియర్ కోహ్లీ వచ్చేశాడు
Virat Kohli and Anushka Sharma: టీమిండియా బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ తండ్రయ్యాడు. ఆయన భార్య, బాలీవుడ్ నటి అనూష్క శర్మ పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కోహ్లీ వెల్లడించాడు. ఈ మేరకు దీనికి సంబంధించిన సమాచారాన్ని కొద్దిసేపటి కిందటే తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు కోహ్లీ- అనూష్క.
Recommended Video

ప్రస్తుతం కోహ్లీ.. భారత జట్టుతో లేడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడట్లేదు. ఈ మ్యాచ్‌లన్నింటికీ దూరంగా ఉంటోన్నాడు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ సిరీస్‌కు దూరమైనట్లు కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. ప్రసవ సమయంలో భార్యకు దగ్గరగా ఉండాలనే కారణంతో సిరీస్ నుంచి తప్పుకొన్నాడు.

ముంబైలోని ఓ టాప్ కార్పొరేట్ ఆసుపత్రిలో అనూష్క శర్మ ఈ నెల 15వ తేదీన ప్రసవించారు. పండంటి బాబు జన్మనిచ్చారు. ఈ బాబు.. కోహ్లీ దంపతులకు రెండో సంతానం. ప్రస్తుతం వారికి ఓ కుమార్తె ఉంది. పేరు వామిక. కిందటి నెలతో వామిక మూడో సంవత్సరంలో అడుగు పెట్టింది.
ఇప్పుడు వామికకు తమ్ముడు వచ్చాడని కోహ్లీ వెల్లడించాడు. బాబుకు అకాయ్ అని పేరు పెట్టినట్లు చెప్పాడు. విరాట్ కోహ్లీ- అనూష్క శర్మ ఓ ఇంటి వాళ్లై ఇప్పటికి ఆరు సంవత్సరాలయింది. 2017 డిసెంబర్ 11వ తేదీన ఇటలీలోని టస్కనీలో వారిద్దరూ పెళ్లిపీటలు ఎక్కిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications