ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ
ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లో సంచలనాత్మక పునరాగమనం చేశాడు. బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో అతను అజేయ అర్ధసెంచరీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రికార్డు విజయాన్ని అందించాడు. కోహ్లీ బ్యాటింగ్ ప్రతాపానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. 15.4 ఓవర్లలో ఆర్సీబీ దీన్ని ఛేదించింది. 200, అంత కంటే ఎక్కువ పరుగులను అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా ఆర్బీసీ సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ విజయంలో విరాట్ కీలక పాత్ర పోషించాడనేది ప్రత్యేకిం చెప్పనక్కర్లేదు. ఆర్బీసీ మాజీ సహచరుడు, టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ వేసిన 15వ ఓవర్‌ను భారీ సిక్సర్‌తో ప్రారంభించిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాతి మూడు బంతులకు మూడు ఫోర్లు బాదాడు. అదే ఓవర్ లో ఛాలెంజర్స్ రాయల్ గా విజయాన్ని అందించాడు. 38 బంతుల్లో అయిదేసి చొప్పున ఫోర్లు, సిక్సర్లు కొట్టాడీ రన్ మెషీన్. 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఈ బ్యాటింగ్ ప్రదర్శన జట్టుకు ఈ రికార్డుస్థాయి విజయాన్ని తెచ్చిపెట్టింది.

భారీ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ మరోసారి కీలక పాత్ర పోషించాడు. ఛేజ్ మాస్టర్ అని నిరూపించుకున్నాడు. గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 59 నాటౌట్ పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ సీజన్‌ను కూడా అజేయ అర్ధసెంచరీతో ప్రారంభించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై భారీ పరుగులు చేయడం ఇది మూడోసారి. గత అయిదు మ్యాచ్‌లలో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలను నమోదు చేశాడు.
మ్యాచ్ అనంతరం అభిమానులకు అభివాదం చేసిన కోహ్లీ.. స్టాండ్స్‌లో ఉన్న భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీనికి అనుష్క కూడా క్షణం ఆలస్యం చేయకుండా అదే రీతిలో ఫ్లయింగ్ కిస్ తిరిగి ఇచ్చింది. కోహ్లీ-అనుష్కల మధ్య సాగిన ఈ ప్రేమ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనుష్క పక్కనే ఉన్న విమెన్స్ టీమిండియా క్వీన్, ఆర్సీబీ మహిళా కెప్టెన్ స్మృతి మంధాన ఆశ్చర్యంగా చూడటం ఇందులో రికార్డయింది.
A special knock, a special win, and a special flying kiss from Virat Kohli to his love, Anushka Sharma! 🥹❤️ pic.twitter.com/HScEYeQ3dW
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) March 28, 2026
విరాట్-అనుష్కల ప్రేమ ప్రదర్శన, స్మృతి మంధాన రియాక్షన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. "కింగ్ ఆటలోనూ అదే రొమాన్స్" అంటూ స్టార్ స్పోర్ట్స్ ప్రశంసించింది. విజయం తర్వాత అనన్యా బిర్లా 'ధురంధర్ పాట పాడటం హైలైట్. 100 లీగ్స్ లో అబ్రార్ అహ్మద్ ను కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్‌కు పరోక్షంగా సెటైర్ సంధించినట్టయిందని నెటిజన్లు వ్యాఖ్యానించడం వార్తల్లో నిలిచింది.
A special knock, a special win, and a special flying kiss from Virat Kohli to his love, Anushka Sharma! 🥹❤️ pic.twitter.com/HScEYeQ3dW
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) March 28, 2026
A special knock, a special win, and a special flying kiss from Virat Kohli to his love, Anushka Sharma! 🥹❤️ pic.twitter.com/HScEYeQ3dW
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) March 28, 2026












Click it and Unblock the Notifications