Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోహ్లీ గుస్సా..: హాఫ్ సెంచరీ చేశాడన్న మాటే గానీ: విసిరి కొట్టడం వెనుక

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని అందుకుంది. ఆదివారం రాత్రి వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లోకల్ టీమ్ ముంబై ఇండియన్స్ ను 18 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లల్లో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫిల్‌ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ అర్ధసెంచరీలతో చెలరేగారు. చివర్లో టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించాడు.

అనంతరం ఛేజింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ పోరాట పటిమ ప్రదర్శించింది గానీ విజయాన్ని అందుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. ముంబై ఇన్నింగ్ లో ఆల్ రౌండర్ షెర్ఫానె రూథర్ ఫర్డ్ ఇన్నింగ్ హైలైట్. తడాఖా చూపించాడు. ఆర్సీబీకి చెమటలు పట్టించాడు. బౌలర్లకు చుక్కలు చూపించాడు. 31 బంతుల్లో 9 భారీ సిక్సర్లు, ఒక బౌండరీతో 71 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

Virat Kohli Shines with 50 But Struggles With Batting Rhythm Injury Claims Keeps Him Off Field

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ కు రాకపోవడం హాట్ టాపిక్ అయింది. జాకెట్ ధరించి డగౌట్‌లో కూర్చొని కనిపించాడు కోహ్లీ. అతను గాయపడ్డాడనే అనుమానాలు తలెత్తాయి. బ్యాటింగ్ సమయంలోనే అసౌకర్యంగా కనిపించాడు. తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీ చేశాడన్న మాటే గానీ.. అతనికి తగ్గ బ్యాటింగ్ కాదది. తన స్థాయికి తగ్గట్టుగా భారీ షాట్లు ఆడలేకపోయాడు. కోహ్లీతో పాటు క్రీజ్ లో దిగిన ఫిల్ సాల్ట్ గానీ, ఆ తర్వాత వచ్చిన రజత్ పటిదార్ గానీ సునామీ ఇన్నింగ్ ఆడారు.

38 బంతుల్లో ఒక సిక్స్, అయిదు ఫోర్లతో సరిగ్గా హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న మరుక్షణమే అవుట్ అయ్యాడు కోహ్లీ. ఆ వెంటనే గ్లోవ్స్, హెల్మెట్ ను విసిరి కొట్టడం కనిపించింది. ఔటైన తర్వాత కోహ్లీ తీవ్ర నిరాశ చెందాడు. హార్దిక్ పాండ్యా ఫుల్ టాస్ ను షాట్ కొట్టే ప్రయత్నంలో టైమింగ్ కోల్పోయి, లాంగ్ ఆన్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు.పెవిలియన్‌కు వెళ్తూ కోపంతో గ్లోవ్స్‌, హెల్మెట్‌ను నేలకేసి విసిరాడు.

ఆ తర్వాత ఫీల్డింగ్ కు కూడా దిగలేదు. కోహ్లీ గాయపడ్డాడనే అనుమానాలు బలపడ్డాయి. నెక్స్ట్ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా లేడా అనే భయాలు సైతం ఆవహించాయి. చీలమండ గాయం కారణంగా కోహ్లీ ఫీల్డింగ్‌కు దూరం అయ్యాడు. గాయంపై రజత్ పటిదార్ స్పందించాడు. గాయపడినట్టు తనకు తెలియదని, అతను ఇప్పుడు బాగానే ఉన్నాడని భావిస్తున్నట్లు చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+