Virat Kohli: లండన్ హోటల్‌లో కూతురితో కోహ్లీ...ఫోటోలు వైరల్...
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరు తెలియని వారుండరు. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌గా పేరుసంపాదించుకున్న విరాట్ కోహ్లీ ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. ఆయన మైదానంలోకి అడుగుపెడితే పరుగుల వర్షం కురుస్తుంది. అయితే, విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల గత కొన్ని రోజులుగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్టార్‌బ్యాట్స్‌మెన్ లండన్‌లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇటీవలే లండన్‌లోని ఆసుపత్రిలో విరాట్ భార్య అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ప్రస్తుతం విరాట్ కోహ్లీ కుటుంబంతో కలసి లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. తన విలువైన సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నాడు కోహ్లీ. ముఖ్యంగా తన కూతురు వామికను తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

విరాట్ కోహ్లీ ఈ నేపథ్యంలో తన కూతురు వామికతో కలిసి లండన్ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే కుమార్తెను తీసుకొని లండన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ తండ్రి కూతుళ్లిద్దరూ ఫుడ్ తింటూ కనిపించారు. విరాట్ కోహ్లీని గుర్తుపట్టిన కొందరు అభిమానులు కోహ్లీ ఫొటోలు తీసి నెట్టింట్లో షేర్ చేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.
టెస్ట్ సిరీస్ దూరమైన కోహ్లీ..
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల గత కొన్ని రోజులుగా ఆటకు దూరమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే, ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు కూడా కోహ్లీ దూరంగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులకు ఫిబ్రవరి 15న లండన్‌లో కొడుకు పుట్టాడు. వీరిద్దరూ తమ కొడుక్కి అకాయ్ అనే పేరును కూడా నామకరణం చేశారు.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ తన కుటుంబంతో కలిసి గత కొన్ని రోజులుగా లండన్‌లోనే ఉంటున్నాడు. తన కూతురు వామికను కూడా తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లండన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన విరాట్, వామికల ఫోటోలు కాస్త సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications