IND vs SA 2023: టెస్టుల్లో 400 పరుగులు రికార్డును కొట్టే టీమిండియా స్టార్ ఎవరో చెప్పిన బ్రియాన్ లారా
భారత జట్టు తీరికలేని షెడ్యూల్‌ను ఎదుర్కొంటోంది. ఐసీసీ వరల్డ్ కప్ 2023 తురువాత ఆస్ట్రేలియాతో అయిదు టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్ ఆడింది. ఇందులో విజయఢంకా మోగించిన భారత్.. ఇక తన నెక్స్ట్ సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లింది. ఈ తెల్లవారుజామున బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డర్బన్‌కు తరలి వెళ్లింది.
సుదీర్ఘంగా సాగే సిరీస్ ఇది. 2024 జనవరి 7వ తేదీ వరకు టీమిండియా దక్షిణాఫ్రికాలోనే ఉంటుంది. మూడు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్స్, రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది భారత జట్టుకు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్.. ఈ నెల 10వ తేదీన ఆరంభమౌతుంది. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియం దీనికి వేదిక.

భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. 12, 14 తేదీల్లో జరిగే మ్యాచ్‌తో టీ20 సిరీస్ ముగుస్తుంది. 17, 19, 21 తేదీల్లో వన్డేలు షెడ్యూల్ అయ్యాయి. ఆ తరువాత టెస్ట్ సిరీస్ షురూ అవుతుంది. 26వ తేదీన తొలి టెస్ట్ జరుగుతుంది. జనవరి 3వ తేదీన రెండో టెస్ట్ ఉంటుంది.
ఈ సిరీస్ ఆరంభానికి ముందు వెస్టిండీస్ లెజెండర్ బ్రియాన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యేకించి- శుభ్‌మన్ గిల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ ప్రతిభ ఉన్న ప్లేయర్‌గా అభివర్ణించాడు. అతని సమకాలీన క్రికెటర్లల్లో మరెవరితోనూ గిల్‌ను పోల్చలేమని, ఈ తరం క్రికెట్‌కు ఓ వరంలాంటోడని చెప్పాడు.
టెస్టుల్లో తాను 400 పరుగుల రికార్డును తుడిచి పెట్టేయ గల సామర్థ్యం గిల్ ఒక్కడికే ఉందని పేర్కొన్నాడు. 1994లో కౌంటీ క్రికెట్‌లో దుర్హమ్ టీమ్‌పై తాను చేసిన 501 పరుగులను కూడా అందుకోగలడని కితాబిచ్చాడు. అన్ని ఫార్మట్లకూ తగ్గట్టుగా ఆడగలిగే నైపుణ్యం అతని సొంతమని లారా చెప్పాడు. టెస్ట్, వన్డే, టీ20ల్లో సెంచరీలు చేసిన అరుదైన క్రికెటర్‌గా ప్రశంసించాడు.
టెస్ట్ మ్యాచ్‌లో బ్రియాన్ లారా 400 పరుగులు చేసిన విషయం తెలిసిందే. సెయింట్ జాన్స్‌లో 2004లో ఇంగ్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో అతను ఈ ఘనతను సాధించాడు. వన్ డౌన్‌గా వచ్చిన లారా 400 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ ఇన్నింగ్‌లో అయిదు వికెట్ల నష్టానికి 751 పరుగులు చేసింది వెస్టిండీస్. ఆ మ్యాచ్ డ్రా అయింది.
-
మ్యాచ్‌లు గెలవలేరు కానీ.. ఐసీసీ ట్రోఫీలు దొంగిలిస్తారా? -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్












Click it and Unblock the Notifications