Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

World Cup 2023: విరాట్ సక్సెస్ క్రెడిట్ వాళ్లదే, నేను పెద్ద ఫ్యాన్ - వివ్ రిచర్డ్స్..!!

ప్రపంచ కప్ లో టీమిండియా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. సెమీస్ లో న్యూజీలాండ్ తో తలపడటం ఖాయమైంది. సెమీస్ లో టీమిండియా ట్రాక్ రికార్డు ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆందోళన పెంచుతోంది. కానీ, గతం కంటే ఇప్పుడ టీమిండియా అన్ని విభాగాల్లోనూ బలంగా ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. బ్యాటింగ్..బౌలింగ్ లో రాణిస్తోంది. ఈ సమయంలో విరాట్ టీంలోనే స్పెషల్ గా మారారు. విరాట్ ఆట తీరు గురించి వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఆసక్తి కర విశ్లేషణ చేసారు.

రికార్డులపై కోహ్లీ గురి:ప్రపంచ కప్ లో సచిన్ సెంచరీల రికార్డులను సమం చేసిన విరాట్ మరో కొత్త రికార్డు పైన కన్నేసారు. కింగ్ ఫ్యాన్స్ అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ క్రియేట్ చేసే రికార్డు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రపంచ కప్ లో ఆ అరుదైన ఫీట్ సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదే సమయంలో విరాట్ పైన ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలతో మెంచెత్తారు. క్రికెట్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లల్లో అతడూ ఒకడని, చరిత్రలో నిలిచిపోతాడని రిచర్డ్స్ చెప్పుకొచ్చారు. ప్రత్యేకించి ప్రపంచ కప్ లో విరాట్ ఆట తీరను రిచర్డ్స్ ప్రత్యేకంగా అభినందించారు.

West Indies legend Viv Richards has said that Virat Kohli is proving his status as one of the all-time greats in cricket

అందరిలోకి టాప్ విరాట్:ప్రపంచ కప్ లో ఎందరో గొప్ప ఆటగాళ్లను చూశాం గానీ వీళ్లందరిలోకి టాప్ ఎవరంటే మాత్రం విరాట్ అని చెప్పారు. తాను విరాట్ కు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు సచిన్ లాంటి క్రికెట్ దిగ్గజాల మధ్య ఒకడిగా విరాట్ నిలిచిపోతాడని రిచర్డ్స్ కితాబిచ్చారు. ప్రపంచకప్ ముందు విరాట్ ఫామ్‌లో లేక సతమతమైన విషయాన్ని కూడా రిచర్డ్స్ ప్రస్తావించారు. ప్రపంచకప్ ముందు అతడు క్లిష్టపరిస్థిని ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేసారు. అతడు ఇక అవసరం లేదని కూడా కొందరు అసాధారణ కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చారు. కానీ, విరాట్ మళ్లీ ఫామ్ సాధించడంలో అతడి వెన్నంటి ఉన్నవారు, బ్యాక్ రూం స్టాఫ్‌‌కే క్రెడిట్ దక్కుతుందని రిచర్డ్స్ వ్యాఖ్యానించారు. ఇప్పుడతను మళ్లీ తన అత్యద్భుత ప్రదర్శన స్థితికి వచ్చేశాడన్నారు.

కోహ్లీ క్రికెట్ కే ఒక ప్రత్యేకం:క్రికెటర్ల ఫామ్ తాత్కాలికమని అంటారు కానీ విరాట్ తాను ప్రత్యేకమని నిరూపించుకున్నాడని రిచర్డ్స్ ప్రశంసించారు. విరాట్ ను చూస్తే తనకు సంతోషంగా ఉందన్నారు. చాలా ఫోకస్డ్‌గా కనిపిస్తున్న విరాట్ క్రికెట్‌కు దక్కిన ఓ గొప్ప క్రీడాకారుడని రిచర్డ్స్ వ్యాఖ్యానించారు. గ్రౌండ్ లో విరాట్ - తనది తీరు ఒకేలా ఉండటంతో కొందరు విరాట్‌ను తనతో పోలుస్తుంటారని చెప్పారు. క్రికెట్ పై విరాట్ కు ఉన్న ఆసక్తి తనకు నచ్చుతుందన్నారు. ఏ పొజిషన్‌లో ఆడుతున్నా, టీం బౌలర్లు ప్యాడ్స్ టచ్ చేసినా వెంటనే అప్పీలుకు వెళుతుంటాడని చెప్పారు. విరాట్ దృష్టి ఎప్పుడూ గేమ్‌పైనే ఉంటుందని... అలాంటి వ్యక్తులంటే తనకు అభిమానమంటూ కోహ్లీ పైన రిచర్డ్స్ ప్రశంసలు కురిపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+