రాహుల్ ద్రావిడ్ అవుట్: టీమిండియాకు కొత్త హెడ్ కోచ్

Rahul Dravid: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. ఇక మాజీ కానున్నారు. ఆయన స్థానంలో కొత్త కోచ్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అన్వేషణ మొదలు పెట్టింది కూడా. టీ20 వరల్డ్ కప్ 2024 తరువాత దీనికి సంబంధించిన ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయనుంది.ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్‌ 2024 టోర్నమెంట్‌‌ ఆడబోతోంది టీమిండియా. ఈ నెల 27వ తేదీన ఐపీఎల్ ఫైనల్స్ ముగిసిన వారం రోజుల తరువాత అంటే జూన్ 2వ తేదీన టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ఆరంభం కానుంది. 29వ తేదీ వరకు కొనసాగుతుంది.

వెస్టిండీస్, అమెరికా.. సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోన్నాయి. ఈ రెండు దేశాలు కలిపి మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి. తొలి సగం మ్యాచ్‌లు వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా అండ్ బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.మిగిలిన సగం మ్యాచ్‌లు- అమెరికాలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్‌ స్టేడియాల్లో నిర్వహించనుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ట్రినిడాడ్, గయానాల్లో రెండు సెమీ ఫైనల్స్, బార్బడోస్‌లో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. భారత్ సహా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఆడబోయే జట్లను ఇప్పటికే ప్రకటించాయి కూడా.

Who is the successor to Rahul Dravid

ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఆడబోయే ఫ్రాంఛైజీల ప్లేయర్లు మినహా టీమిండియాకు ఎంపికైన మిగిలిన క్రికెటర్లు ఈ నెల 24వ తేదీన వెస్టిండీస్‌కు బయలుదేరే అవకాశం ఉంది. ఈ టీ20 వరల్డ్ కప్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ- రాహుల్ ద్రావిడ్‌కు మాత్రం ఉద్వాసన తప్పదు.రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ ముగిసిన అనంతరం దాన్ని రెన్యూవల్ చేయదలచుకోలేదు బీసీసీఐ. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టింది. దీనికోసం దరఖాస్తులను ఆహ్వానించింది కూడా. హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 27. సాయంత్రం 6 గంటల్లోగా బీసీసీఐకి తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.

విదేశీ ఆటగాడిని హెడ్ కోచ్‌గా ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదు. కోచ్‌గా ఎవరు ఉండాలి? ఫారిన్ ప్లేయర్‌ను తీసుకోవాలా? వద్దా అనేది ఇంకా నిర్ణయించలేదు. దీనిపై క్రికెట్ అడ్వైజరీ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని రాహుల్ ద్రావిడ్‌కు సైతం కల్పించింది బీసీసీఐ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+