వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే కప్ జట్టుకే..!

ఐపీఎల్-2025 చివరి దశకు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. జూన్ 3న (మంగళవారం) అహ్మదాబాద్‌ వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. ఆర్సీబీ నాలుగుసార్లు ఫైనల్ చేరినప్పటికీ, ఒక్కసారి కూడా కప్‌ను సొంతం చేసుకోలేకపోయింది. అలాగే 2014 తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధించిన చరిత్రే అవుతుంది.

అయితే అహ్మదాబాద్‌లో వర్షం ముప్పు పొంచి ఉండటంతో, క్రికెట్ అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ రద్దయితే, కప్పు ఏ జట్టుకు దక్కుతుంది అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. నిబంధనల ప్రకారం, కొన్ని స్పష్టమైన నియమాలు ఉన్నాయి, అవేంటో చూద్దాం.

Who will be the winner of the IPL final is called off due to rain

ముందుగా, ఐపీఎల్ ఫైనల్ 2025కు ఒక రిజర్వ్ డే ఉంది. అంటే, జూన్ 3న (మంగళవారం) మ్యాచ్ జరగకపోతే, జూన్ 4న (బుధవారం) మ్యాచ్ కొనసాగుతుంది. ప్రతి రోజు కూడా మ్యాచ్‌ను పూర్తి చేయడానికి అదనంగా 120 నిమిషాల సమయం కేటాయించబడింది. వర్షం కారణంగా ఆలస్యమైనా, ఓవర్లు తగ్గించినా, డక్ వర్త్-లూయిస్-స్టర్న్ (DLS) పద్ధతి ద్వారా ఫలితాన్ని నిర్ధారించడానికి కనీసం 5 ఓవర్ల మ్యాచ్ జరిగేలా చూస్తారు.

ఒకవేళ, రిజర్వ్ డేలో కూడా వర్షం తగ్గకుండా, కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే, అప్పుడే అసలు నిబంధన అమల్లోకి వస్తుంది. ఆ నిబంధన ప్రకారం, లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు!

ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, ఐపీఎల్ 2025 లీగ్ దశలో పంజాబ్ కింగ్స్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. వారు 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నారు. కాబట్టి, వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ పూర్తిగా రద్దయితే, కప్పు పంజాబ్ కింగ్స్ ఖాతాలో చేరుతుంది. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తుంది, ఎందుకంటే వారు క్వాలిఫైయర్ 1లో పంజాబ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు.

రెండు జట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు పంజాబ్ కింగ్స్, ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్‌ను గెలవలేదు. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగిస్తే, ఆటగాళ్లు, అభిమానుల ఆశలు ఆవిరైపోతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+