ఇంటి ముందే దారుణం: రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ దారుణ హత్య!

దక్షిణాఫ్రికాకు చెందిన రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ జోలానీ టెటే(38) దారుణంగా హత్యకు గురయ్యారు. ఈస్టర్న్ కేప్‌లోని మ్డాంట్సేన్‌లో ఉన్న తన ఇంటి బయట శుక్రవారం ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆయన తన ఇంటి ముందు గేటు తెరిచంత వరకు తన కారులో వేచి చూస్తుండగా.. ముసుగులు ధరించిన ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ విచక్షణారహిత దాడిలో జోలానీ టెటే అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయనతో పాటు కారులో ఉన్న 27 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడింది. బుల్లెట్ గాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినప్పటికీ.. ఇప్పటివరకు దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయలేకపోయారు.

పాకిస్థాన్‌కు ఘోర అవమానం.. టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో చెత్త రికార్డు!
పాకిస్థాన్‌కు ఘోర అవమానం.. టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో చెత్త రికార్డు!

2007లో తొలి ప్రపంచ టైటిల్‌
1988లో జన్మించిన జోలానీ టెటే 'లాస్ట్ బోర్న్'గా బాక్సింగ్ ప్రపంచంలో ఎంతో ప్రాచుర్యం పొందారు. జోలానీ టెటే వివిధ వెయిట్ కేటగిరీలలో ప్రపంచ టైటిళ్లను గెలుచుకున్నాడు. జోలానీ టెటే 2007, 2008లలో ప్రపంచ టైటిళ్లను గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2017, 2019లో వరల్డ్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ప్రపంచ టైటిళ్లను గెలుచుకున్నాడు. ప్రపంచ టైటిల్ పోరాటంలో అత్యంత వేగవంతమైన నాకౌట్ రికార్డు కూడా జోలానీ టెటే పేరిట ఉంది. అతను 2017లో దక్షిణాఫ్రికాకు చెందిన సిబోనిసో గోన్యాను కేవలం 11 సెకన్లలో నాకౌట్ చేశాడు. ఈ ప్రదర్శనతో జోలానీ టెటే ప్రపంచ టైటిల్ పోరాటంలో అత్యంత వేగవంతమైన నాకౌట్ కోసం గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. టెటే తన ప్రొఫెషనల్ కెరీర్‌లో మొత్తం 34 మ్యాచ్‌లలో పోరాడి, వాటిలో 29 గెలిచి, నాలుగు ఓడిపోయి, ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.

World Champion Boxer Zolani Tete Shot Dead Outside His Home in South Africa Full Details Here

2022లో చివరి మ్యాచ్
జోలానీ టెటే చివరిసారిగా జులై 2022లో లండన్‌లోని వెంబ్లీ అరీనాలో బ్రిటన్‌కు చెందిన జాసన్ కన్నింగ్‌హామ్‌తో తలపడ్డాడు. అతను ఆ పోరులో నాకౌట్ ద్వారా విజయం సాధించాడు.అయితే తదనంతరం జరిపిన డోపింగ్ పరీక్షలో అతని నమూనాలో స్టానోజోలోల్ అనే అనాబాలిక్ స్టెరాయిడ్ ఉన్నట్లు తేలడంతో యూకే డోపింగ్ నిరోధక సంస్థ అతనిపై నాలుగేళ్ల నిషేధం విధించింది.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కు అల్టిమేట్ పవర్స్: సర్వశక్తిమంతుడు: భారత్ కు సవాళ్లు
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కు అల్టిమేట్ పవర్స్: సర్వశక్తిమంతుడు: భారత్ కు సవాళ్లు

జులై 2026లో ముగిసిన నిషేధం
జోలానీ టెటేపై విధించిన నాలుగేళ్ల నిషేధం జులై 29, 2026న ముగిసింది. నిషేధం ఎత్తివేసిన తర్వాత జోలానీ టెటే మళ్లీ రింగ్‌లోకి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన మేనేజర్ మిలా టెంగిమ్‌ఫెన్, టెటే రీ-ఎంట్రీ పోరాటం కోసం శిక్షణ పొందుతున్నాడని పేర్కొన్నారు.తాను రింగ్‌లోకి తిరిగి రావాలనుకుంటున్నట్లు టెటే జనవరిలో కూడా చెప్పాడు. తన ప్రణాళికలు ఇంకా ఖరారు కాలేదని, తాను ఒక రీఎంట్రీ బౌట్ కోసం ఎదురుచూస్తున్నానని అతను పేర్కొన్నాడు. సరిగ్గా రీఎంట్రీ ప్లాన్స్ సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ దారుణ హత్య క్రీడా లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

జోలానీ టెటే మృతి పట్ల దక్షిణాఫ్రికా క్రీడల మంత్రి గేటన్ మెకెంజీ సంతాపం వ్యక్తం చేస్తూ, దేశం ఒక గొప్ప యోధుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జోలానీ టెటే పేరును, వారసత్వాన్ని దేశం తేలికగా తీసుకోదని చెబుతూ, మెకెంజీ టెటే కుటుంబానికి, మ్డాంట్సానే ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+