World Cup 2023: ఆసీస్ తో మ్యాచ్ వేళ రోహిత్ కు టెన్షన్ పెంచుతున్న ఆ ఇద్దరు..!!

క్రికెట్ ప్రపంచ కప్ సమరంలో భారత్ తొలి మ్యాచ్ కు సిద్దం అవుతోంది. చెన్నై వేదికగా టీమిండియా తొలి మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో ఆదివారం తల పడనుంది. ఈ మ్యాచ్ పైన భారత్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న వేళ కెప్టెన్ రోహిత్ కు ఇద్దరు ఆటగాళ్ల సమచారం ఆందోళన పెంచుతోంది. ఇద్దరు కీలకమైన ప్లేయర్లు కావటంతో..ప్లాన్ బీ పైన ఫోకస్ చేసారు. దీంతో తుది టీం ఎంపిక పైన ఆసక్తి కొనసాగుతోంది.

తుది టీంపై ఉత్కంఠ : భారత క్రికెట్‌ టీమ్‌ తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతోన్న తరుణంలో తుది టీం ఎంపిక పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ప్లేయర్స్‌ ఒక్కొక్కరు గాయాల భారిన పడుతుండడంతో తీవ్ర ఆందోళన కలుగుతోంది. ఇప్పటికే టీమిండియా స్టార్ ఓపెనర్ శుభమన్‌ గిల్‌ డెంగ్యూ బారిన పడిన విషయం తెలిసిందే.

World Cup 2023: All Rounder Hardeik Pandya Injured During Nets Ahead Of IND vs AUS match on Sunday

దీంతో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు గిల్‌ అందుబాటులో ఉండడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే తాజాగా ఆల్‌ రౌండర్‌ పాండ్యా గాయపడినట్లు సమాచారం. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పాండ్యాకు గాయమైంది. సిరాజ్‌ వేసిన ఓ బౌన్సర్, పాండ్యా వేలికి బలంగా తగిలిందని తెలుస్తోంది.

పాండ్యాకు గాయం : అయితే దీనిపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఒకవేళ మ్యాచ్‌కు పాండ్య దూరమైతే టీమిండియాకు సమస్యగా మారుతోంది. ఐదవ బౌలర్‌గా, మిడిల్ ఆర్డర్‌లో మంచి బ్యాటింగ్‌తో పాండ్య టీమ్‌కు అండగా నిలవగలడు. అలాంటి ప్లేయర్‌ మ్యాచ్‌కు దూరమైతే ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.

World Cup 2023: All Rounder Hardeik Pandya Injured During Nets Ahead Of IND vs AUS match on Sunday

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న ఆస్ట్రేలియా, భారత్‌ మ్యాచ్‌లో పాండ్యా ఆడుతాడా లేదా అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇక డెంగ్యూతో బాధపడుతోన్న గిల్‌ మ్యాచ్‌కు దూరమైతే.. ఇషాన్‌ కిషన్‌తో కలిసి రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది.

గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ : గిల్ అనారోగ్యం పైన కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. శుభ్‌మన్ గిల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పాడు. ప్రస్తుతం అతను చాలా సిక్ అయ్యాడని నిర్ధారించారు. టీమిండియా మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. గిల్ ఇంకా జట్టుకు అందుబాటులోనే ఉన్నాడని చెప్పాడు శుభ్‌మన్ గిల్ హై ఫీవర్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక, ప్రపంచ కప్ లో భాగంగా ఆసీస్ తో జరిగే తొలి మ్యాచ్ పైన ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+