వరల్డ్ కప్‌లో నేను రాణించడం పట్ల కొందరు భరించలేకపోతున్నారు: మహ్మద్ షమీ

లక్నో: ఫైనల్స్ మినహా ఐసీసీ ప్రపంచ కప్ 2023లో భారత జట్టు తిరుగులేని విజయాలను సాధించింది. ఏకచ్ఛాత్రాధిపత్యాన్ని ప్రదర్శించింది. లీగ్స్‌, సెమీ ఫైనల్స్‌లో ఓటమి అనేదే తెలియని టీమ్ ఏదైనా ఉందంటే అది ఒక్క భారత్ మాత్రమే. ఫైనల్స్ గెలిచివుంటే అదో చరిత్ర అయ్యుండేది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని జట్టుగా చరిత్ర సృష్టించేది.

జట్టు సమష్టిగా రాణించడం వల్లే ఈ వరుస విజయాలు సొంతం అయ్యాయి. బ్యాటర్లు, బౌలర్లు.. పోటీ పడి మరీ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కెేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్ సత్తా చాటడంతో విజయాలు దాసోహం అయ్యాయి.

I can only laugh at them, Mohammed Shami slams former Pakistan cricketers

ప్రత్యేకించి- మహ్మద్ షమీ (Mohammed Shami) ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయ పడటం వల్ల జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఈ వరల్డ్ కప్‌లోనే అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. టోర్నమెంట్ మొత్తం మీద ఏడు మ్యాచ్‌లను మాత్రమే ఆడిన షమీ.. 24 వికెట్లు నేలకూల్చాడు.

ఇది- కొందరు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లకు ఏ మాత్రం మింగుడు పడలేదు. టోర్నమెంట్ కొనసాగుతున్న సమయంలోనే అతనిపై విమర్శలు చేశారు. కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బగొట్టేలా వ్యవహరించారు. దీనిపై మహ్మద్ షమీ తాజాగా స్పందించాడు. వాళ్లు చేసిన విమర్శలను తిప్పి కొట్టాడు.

వరల్డ్ కప్‌లో వరుసగా 5, 4, 5, 7.. ఇలా వికెట్లను తీయడాన్ని కొంత మంది మాజీ పాక్ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారని షమీ వ్యాఖ్యానించాడు. వారందరికీ వసీం అక్రమ్ ఒక్కడే సమాధానం చెప్పాడని, అయినా గానీ వరు తనపై ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ సమయంలో మనం వేరే బంతిని వాడుతున్నట్లు వివాదాలు సృష్టించడానికి ప్రయత్నించారని పేర్కొన్నాడు.

పాకిస్తాన్ ప్లేయర్ హసన్ రజా.. చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టాడు షమీ. అవి అర్థం రహితమైనవిగా అభివర్ణించాడు. తామే అత్యుత్తమ పేసర్లం అనే భావన పాకిస్తాన్ ప్లేయర్లల్లో ఉందని, అది తప్పు అని చెప్పాడు. మ్యాచ్‌లో అవసరమైన సమయంలో మంచి పెర్ఫార్మ్ చేసిన వాళ్లే గొప్ప ఆటగాళ్లుగా తాను భావిస్తానని, ఇప్పటికైనా వారు ఈ భావన నుంచి బయటికి రావాలని సూచించాడు. అలాంటి వారిని చూసి నవ్వుకోవడం తప్ప తానేమీ చేయలేనని అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+