ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగినా చాలు: పాకిస్తాన్ ఖేల్ ఖతం

కోల్‌కత: ఐసీసీ ప్రపంచ కప్‌ 2023లో ముగింపు దశకు వచ్చేసింది. గ్రూప్స్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. నేడు రెండు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఈ ఉదయం 10:30 గంటలకు ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్ తలపడనున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

రెండోది- మధ్యాహ్నం 2 గంటలకు కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో. ఇంగ్లాండ్‌ను ఢీకొడుతుంది పాకిస్తాన్. గ్రూప్ దశలో ఈ నాలుగు జట్లకూ ఇదే చివరి మ్యాచ్‌లు. ఇందులో ఆస్ట్రేలియా ఒక్కటే సెమీ ఫైనల్స్‌కు చేరింది. మిగిలిన మూడూ ఇంటిదారి పట్టక తప్పదు. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఓడినా పెద్దగా తేడా ఉండదు.

World Cup 2023, PAK vs ENG: Pakistan playing 11 against England

ఇంగ్లాండ్- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కూడా ఇంతే. ఈ రెండూ సెమీ ఫైనల్స్ రేసు నుంచి తప్పకొన్నాయి. సాంకేతికపరంగా చూసుకుంటే పాకిస్తాన్‌కు సెమీ ఫైనల్స్ చేరడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి గానీ అది అసాధ్యమే. న్యూజిలాండ్‌కు మించి తన నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాలంటే కొండంత లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచాలి.

నెట్ రన్‌రేట్ పెంచుకోవడానికి పాకిస్తాన్ ఖచ్చితంగా తొలుత బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. 300 పరుగులను ఇంగ్లాండ్‌కు టార్గెట్‌గా పెట్టి.. ఆ జట్టును 13 పరుగుల్లోపే అవుట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు గానీ పాకిస్తాన్ నెట్ రన్‌రేట్ పెరగదు. ఇంగ్లాండ్‌ను అలా అవుట్ చేయడం దాదాపుగా అసాధ్యమే.

ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి ప్రయోగాలూ చేయదలచుకోలేదు. ఇదివరకు ఆడిన ప్లేయర్లనే తుదిజట్టులో తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ కూడా ప్రయోగాల జోలికి వెళ్లకపోవచ్చు. గాయపడ్డ ప్లేయర్లు ఈ రెండు జట్లలోనూ లేకపోవడం వల్ల మార్పులు ఉండవు.

2019 వరల్డ్ కప్ ఛాంపియన్ ఇంగ్లాండ్. ఈ టోర్నమెంట్‌లో అంచనాలను తలకిందులు చేసింది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లల్లో రెండింట్లో గెలిచిందంతే. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ కావడం వల్ల పరుగుల వరద పారే అవకాశం ఉంది.

పాకిస్తాన్ తుదిజట్టులో - అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సవూద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, అఘా సల్మాన్, హసన్ అలీ, మహ్మద్ వసీం జూనియర్, షహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్ ఆడొచ్చు.

ఇంగ్లాండ్ తుది జట్టులో- జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్ వికెట్ కీపర్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+