WPL Final: ఢిల్లీ vs ముంబై.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచేదెవరు ?

WPL Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) 2025 ఫైనల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు(శనివారం) ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరగనుంది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. లీగ్ దశలో ఢిల్లీల క్యాపిటల్స్ అగ్రస్థానంలో ఉండగా.. ఎలిమినేటర్ లో గుజరాత్ జెయింట్స్ ను ఓడించి ముంబయి ఇండియన్స్ ఫైనల్ కు చేరుకుంది. ఈ టోర్నీలో రెండు జట్లు అద్భుతంగా రాణించాయి. ఫిబ్రవరి 14న ప్రారంభమైన ఈ ప్రీమియర్ లీగ్‌లో ఆరు జట్లు పాల్గొన్నాయి. చివరకు ఢిల్లీ, ముంబై జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా మూడోసారి ఫైనల్స్ కు చేరుకోవడం గమనార్హం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మూడు సీజన్లు జరగగా.. మూడింటిలోనూ పాయింట్ల పట్టికలో ఢిల్లీ టాప్ లో నిలిచింది.

డబ్ల్యూపీఎల్(ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) ఆరంభ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఫైనల్స్ కు చేరుకోగా ముంబై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సారి ముంబైపై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ భావిస్తోంది. గతేడాది జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ కు చేరుకుంది. బెంగళూరు-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. వరుసగా మూడో సారి ఫైనల్ కు చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబైతో ఆడనుంది. ఈ మ్యాచ్ ముంబై వేదికగా జరుగుతుండడంతో ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. ఈ ఏడాదైనా కప్ ను సాధించాలని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కసితో బరిలోకి దిగుతోంది. మరి ఏ జట్టు గెలుస్తుందో వేచి చూడాల్సిందే.

WPL 2025 Final Delhi vs Mumbai Who Will Win the Women s Premier League Title

ఫైనల్ పిచ్ ఎలా ఉంది?
ముంబైలో బ్రబోర్న్ స్టేడియంలోని పిచ్ మంచి బౌన్స్, పేస్ ను అందిస్తుంది. ఈ పిచ్ అధిక స్కోరింగ్ మ్యాచ్ లకు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభంలో బ్యాటర్లకు సహాయం లభిస్తుంది. కానీ తర్వాత బౌలర్లు కూడా ప్రయోజనం పొందవచ్చు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. రెండు జట్ల బ్యాటర్లు ప్రస్తుతం చెలరేగుతుండడంతో ఫైనల్ లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు
ఫైనల్ లో తలపడుతున్న రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టులో 493 పరుగులు చేసిన నాట్ స్కీవర్ ప్రంట్ ఉన్నారు. హేలీ మాథ్యూస్ 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకుంది. మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో షెఫాలీ వర్మ విధ్వంసక బ్యాటింగ్, జెస్ జోనాసెన్, శిఖా పాండే ఆల్ రౌండ్ సామర్థ్యం ఉన్నాయి.

బ్రబోర్న్ స్టేడియం గణాంకాలు ఇలా..
బ్రబోర్న్ స్టేడియం రికార్డుల గురించి మాట్లాడుకుంటే.. ఇక్కడ ఇప్పటివరకు 12 మ్యాచ్ లు జరిగాయి. ఈ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 6 మ్యాచ్ లలో గెలిచింది. అయితే తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టు కూడా 6 మ్యాచ్ లలో గెలిచింది. ఈ స్టేడియంలో అత్యధిక స్కోరు 209 పరుగులు. ఈ స్టేడియంలో ప్రతిసారి 150 కంటే పెద్ద స్కోర్లే నమోదయ్యాయి. అంటే ఈ సారి కూడా భారీ స్కోర్లను ఆశించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+