Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

year ender 2023: ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్లు వీరే

2023వ సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాదిలో ఎన్నో మంచి, చెడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ ఏడాదిలో టీమిండియా క్రికెట్ర్లు తమ వైవివాహిక బంధంలోకి ఆనందంగా అడుగుపెట్టారు. కొందరు తాము ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకుంటే.. మరికొందరు అరెంజ్ మ్యారెజ్ చేసుకున్నారు. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ నుంచి చివరగా ముఖేష్ కుమార్ వరకు తమ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..

కేఎల్ రాహుల్-అథియా శెట్టి:టీమిండియాలో స్టార్ క్రికెటర్‌గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ ఈ ఏడాదిలో తను చాల కాలంగా ప్రేమిస్తున్న అథియా శెట్టిని వివాహమాడాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురే ఈ అథియా శెట్టి. జనవరి 23న రాహుల్-అథియా శెట్టిలు మూడు ముళ్ల బంధంతో ఏకమయ్యారు. సునీల్ శెట్టి ఫాంహౌస్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. వీరి వివాహ వేడుకకు ప్రముఖ క్రికెటర్లు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

year ender 2023: know the 7 indian cricketers who married in 2023.

మేహా పటేల్‌తో అక్షర్ పటేల్ వివాహం:టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తన ప్రియురాలు మేహా పటేల్‌ను వివాహం చేసుకున్నాడు. 2023, జనవరి 27న మేహా పటేల్‌కు మూడు ముళ్లు వేశాడు. వీరు కూడా చాలా కాలంగా ప్రేమించుకున్న తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం వడదోరలో గుజరాతి సాంప్రదాయం ప్రకారం జరిగింది.

మరాఠీ సాంప్రదాయంలో శార్దూల్ ఠాకూర్ పెళ్లి:టీమిండియా ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్ తన ప్రియురాలు మిట్టాలి పారుల్కర్‌ను వివాహం చేసుకన్నాడు. 2023, ఫిబ్రవరి 27న పారుల్కర్‌తో కలిసి ఏడడుగులు వేశాడు. వీరి వివాహం ముంబైలో మరాఠీ సాంప్రదాయంలో జరిగింది.

ఉత్కర్ష పవార్‌తో ఏడడుగులు వేసిన రుతురాజ్ గైక్వాడ్:టీ20 క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తూ సీనియర్ క్రికెటర్ల ప్రశంసలు అందుకుంటున్న రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ ఏడాదిలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఉత్కర్ష అమర్ పవార్ అనే యువతిని ఈ ఏడాది జూన్ 3న వివాహం చేసుకున్నాడు. అయితే, ఆమె కూడా క్రికెటర్ కావడం గమనార్హం. ఆమె మహారాష్ట్ర తరపున దేశవాలీ టోర్నీల్లో ఆడుతున్నారు. మరోవైపు, ప్రస్తుతం రుతురాజ్ సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు.

year ender 2023: know the 7 indian cricketers who married in 2023.

రచనతో ప్రసిద్ధ కృష్ణ వివాహం:టీమిండియా ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ తన ప్రియురాలు రచనను వివాహమాడాడు. ఈ ఏడాది జూన్ 8న సుదీర్ఘ కాలంగా ప్రేమిస్తున్న రచనకు మూడు ముళ్లు వేశాడు. దక్షిణ భారతదేశ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది.

స్వాతితో నవదీప్ పెళ్లి:టీమిండియా క్రికెటర్ నవదీప్ సైనీ వివాహం స్వాతి అస్థానాతో ఈ ఏడాది నవంబర్ 23న జరిగింది. ఉదయ్‌పూర్ దేబారి రిసార్టులో వీరి వివాహం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది.

చివరగా ముకేష్ కుమార్ వివాహం:టీమిండియా స్పీడ్ బౌలర్ ముకేష్ కుమార్ వివాహం ఈ ఏడాది చివరలో జరిగింది. తన చిరకాల స్నేహితురాలు దివ్య సింగ్‌తో నవంబర్ 28న ముకేష్ కుమార్ ఏడడుగులు వేశాడు. గోరఖ్‌పూర్ రిసార్టులో వీరి వివాహం జరిగింది. ఇటీవల ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబర్చాడు ముకేష్ కుమార్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+