తండ్రి చేసిన పాపం.. కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీకి సారీ చెప్పిన యువీ!
టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ తన తండ్రి యోగరాజ్ సింగ్ చేసిన వివాదాస్పద కామెంట్లపై తొలిసారి నోరు విప్పాడు. తన తండ్రి గతంలో దిగ్గజ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్‌లపై చేసిన అనుచిత కామెంట్లకు గానూ యువరాజ్ సింగ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. ఓ పాడ్‌కాస్ట్ టీజర్లో యువరాజ్ సింగ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తండ్రి కామెంట్లపై యువరాజ్ సింగ్ ఆవేదన
యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ గత కొంతకాలంగా దిగ్గజ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. తన కొడుకు కెరీర్ నాశనం కావడానికి ధోనీనే కారణమని.. కపిల్ దేవ్ తనను జట్టు నుంచి అన్యాయంగా తీసేశాడని యోగరాజ్ ఆరోపణలు చేసేవారు. దీనిపై స్పందించిన యువరాజ్ సింగ్.. "నేను కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. మా నాన్న మాట్లాడే తీరు సరైనది కాదని ఆయనతో ముందే చెప్పాను" అని యువీ ఎమోషనల్ అయ్యాడు.

కపిల్ దేవ్‌ను చంపాలనుకున్నాను: యోగరాజ్ సెన్సేషనల్ కామెంట్స్
యోగరాజ్ సింగ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1980వ దశకంలో తనను జట్టు నుంచి తొలగించినందుకు కపిల్ దేవ్‌పై తనకు ఎంత కోపం ఉండేదో వివరించారు. యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.. "కపిల్ దేవ్‌ను చంపాలనే ఉద్దేశంతో నేను తుపాకీ తీసుకుని ఆయన ఇంటికి వెళ్లాను. కానీ అక్కడ ఆయన తల్లి ఉండటంతో మనసు మార్చుకున్నాను. ఆ రోజే నేను క్రికెట్ ఆడకూడదని.. యువీతో ఆడించాలని నిర్ణయించుకున్నాను" అని యోగరాజ్ సింగ్ చేసి కామెంట్స్ అప్పట్లో పెను దుమారం రేపాయి.
ధోనీపై యోగరాజ్ సింగ్ కామెంట్స్
యువరాజ్ సింగ్ కు టీమిండియా కెప్టెన్సీ రాకపోవడానికి, ఆయన కెరీర్ త్వరగా ముగియడానికి ఎంఎస్ ధోనీయే ప్రధాన కారణమని యోగరాజ్ సింగ్ గట్టిగా నమ్మేవారు. ధోనీ వల్లే తన కొడుకు అన్యాయానికి గురయ్యాడని ఆయన పలుమార్లు మీడియా ముందు ఆరోపించారు.అయితే యువరాజ్ సింగ్ మాత్రం ఎప్పుడూ ధోనీతో తనకు ఉన్న అనుబంధాన్ని గౌరవిస్తూనే వచ్చాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ విజయాల్లో వీరిద్దరూ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
భారత క్రికెట్ చరిత్రలో ధోనీ, కపిల్ దేవ్, యువరాజ్ సింగ్ ముగ్గురూ దిగ్గజాలే కావడం గమనార్హం. తన తండ్రి చేసిన వ్యక్తిగత విమర్శల వల్ల వారి మధ్య ఉన్న గౌరవం దెబ్బతినకూడదని యువరాజ్ సింగ్ భావిస్తున్నాడు. తన తండ్రి ప్రవర్తన పట్ల తాను బాధపడుతున్నానని, క్రీడా స్ఫూర్తిని గౌరవించడమే ముఖ్యమని యువీ ఈ సందర్భంగా చాటిచెప్పాడు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications