మద్యం మత్తులో టీమిండియా స్టార్ క్రికెటర్..భార్యతో విడాకులే కారణం..?
టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి గత కొద్దిరోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. యుజ్వేంద్ర చాహల్ , ధనశ్రీ వర్మలది ప్రేమ వివాహం. 2020లో వీరి వివాహం జరిగింది. యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది.
ధనశ్రీ వర్మ డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆమె తన ప్రత్యేకమైన డ్యాన్స్ వీడియోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంటారు.ధనశ్రీ చిన్నప్పటి నుండి భరతనాట్యం నేర్చుకున్నారు. ఆమె తన స్వంత డ్యాన్స్ కంపెనీని కూడా స్థాపించారు. ఇటీవలే ఆమె ఓ తెలుగు సినిమాలో కూడా హీరోయిన్‌గా నటించడానికి రెడీ అయ్యారు.అయితే గత కొంతకాలంగా యుజ్వేంద్ర చాహల్,ధనశ్రీ వర్మల వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో వీరు వీడిగా ఉంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.ఇదే సమయంలో చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించాడు. ధనశ్రీ కూడా చాహల్‌ను అన్‌ఫాలో చేసింది. అంతకు ముందు ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుంచి భర్త పేరుని తొలగించింది. దీంతో అప్పుడే వీరి విడాకుల పుకార్లు ఊపందుకున్నాయి. మరి ఇప్పుడు ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో ఇప్పుడు నిజంగానే విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పెళ్లి రోజున సైతం వీరిద్దరు విషెష్ చెప్పుకోలేదు. సరిగ్గా ఇదే సమయంలో చాహల్ మద్యం మత్తులో తూగుతూ ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మద్యం మత్తులో తూగుతోన్న చాహల్ ను ఒక వ్యక్తి పబ్ నుంచి బయటకు తీసుకొస్తున్నట్లు ఉంది. ఇక కారులో కూర్చొన్న తర్వాత ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీయకుండా చాహల్ తన ముఖానికి చేయి అడ్డు పెట్టుకోవడం కనిపించింది. అయితే ఇది పాత వీడియోగా తెలుస్తోంది.పాత వీడియోనే ఇప్పుడు పరిస్థితికి తగ్గట్టు నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. విడాకులపై అటు ధనశ్రీ వర్మ కానీ, ఇటు చాహల్ కానీ ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు.












Click it and Unblock the Notifications