Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జింబాబ్వే చేతిలో మట్టి కరిచిన ఆస్ట్రేలియా- ఏం మ్యాచ్ రా బై

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే సంచలన విజయాన్ని అందుకుంది. టైటిల్ హాట్ ఫేవరెట్ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. 23 పరుగుల తేడాతో జయకేతనాన్ని ఎగురవేసింది. అటు బ్యాటింగ్, అనంతరం బౌలింగ్ లో జింబాబ్వే తడాఖా చూపింది. పదును తగ్గలేదని నిరూపించింది. పెద్ద జట్లకు సవాల్ విసిరింది. ఈ విజయంతో నాలుగు పాయింట్లతో గ్రూప్ బీలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా మూడోస్థానానికి పరిమితమైంది.. ప్రస్తుతానికి.

తొలుత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దీన్ని అందుకోలేకపోయింది ఆస్ట్రేలియా. జింబాబ్వేలో ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ ఇన్నింగ్ హైలైట్. 56 బంతుల్లో ఏడు ఫోర్లతో 64 పరుగులతో నాటౌట్ గా నిలిచాడీ ఓపెనర్. మరో ఓపెనర్ టడివనాషె మారుమనితో కలిసి భారీ ఇన్నింగ్ నెలకొల్పాడు. మారుమని- 35, టాప్ ఆర్డర్ బ్యాటర్ ర్యాన్ బ్యూరీ- 35 పరుగులతో రాణించారు. కేప్టెన్ సికందర్ రజా 13 బంతుల్లో 25 పరుగులతో మెరుపు ఇన్నింగ్ ఆడాడు.

Zimbabwe Stuns T20 World Cup victory over Australia in 23-run win Muzarabani and Evans in spotlight

అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఏ మాత్రం దీన్ని ఛేదించలేకపోయింది. 19.3 ఓవర్లల్లో 146 పరుగులకు చాప చుట్టేసింది. మిడిలార్డర్ బ్యాటర్ రెన్ షా ఒక్కడే టాప్ స్కోరర్. 44 బంతుల్లో 65 పరుగులు చేశాడు. రెన్ షా సహా ఆస్ట్రేలియా బ్యాటర్లల్లో ఇద్దరంటే ఇద్దరు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగలిగారంటే.. జింబాబ్వే బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టాప్ టు బాటమ్ వరకు ఏ ఒక్క బ్యాటర్ కూడా కుదురుగా క్రీజ్ లో నిల్చోలేకపోయాడు బౌలర్ల ధాటికి.

జోష్ ఇంగ్లీస్- 8, కేప్టెన్ ట్రావిస్ హెడ్- 17, కామెరాన్ గ్రీన్- 0, టిమ్ డేవిడ్- 0, గ్లెన్ మ్యాక్స్ వెల్- 31, మార్కస్ స్టొయినిస్- 6, బెన్ డ్వార్షుయిస్- 6, నాథన్ ఎల్లిస్- 7 (నాటౌట్), ఆడం జంపా- 2, మాథ్యూ కున్హెన్ మాన్- 0 పరుగులు చేశారు. జింబాబ్బే బౌలర్లల్లో బ్లెస్సింగ్ ముజరబాని- 4, బ్రాడ్ ఇవాన్స్- 3 వికెట్లతో చెలరేగారు. ముజరబాని తన నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు కుప్పకూల్చాడు. బ్రాడ్ ఇవాన్స్ 3.3 ఓవర్లల్లో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. వెల్లింగ్టన్ మసకద్జా, ర్యాన్ బర్ల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఈ విజయంతో గ్రూప్ బీలో జింబాబ్వే రెండో స్థానానికి ఎగబాకింది. ఆడిన రెండు మ్యాచ్ లల్లో రెండింటినీ గెలిచింది. నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంక కూడా నాలుగు పాయింట్లనే సాధించినప్పటికీ.. నెట్ రన్ రేట్ ఆధారంగా ఆ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. ఈ నెల 17వ తేదీన జింబాబ్వే తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది. ఐర్లాండ్ తో ఢీ కొట్టనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+