హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాపం చిరంజీవి!

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఒక ఏడాది క్రితం వరకు ఆయన ఎంతో సంతోషమైన జీవితం గడిపారు. ముప్పై ఏళ్ళ క్రితం ఒక సామాన్య నటుడిగా తెలుగుతెర మీద అడుగుపెట్టి పాతికేళ్ళ పాటు సూపర్ స్టార్ గా వెలిగారు. వెండి తెర ద్వారా నిర్మాతలకు బంగారం పండించిన హీరో ఆయన. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏం సాధిస్తున్నారు?

ఆయన ప్రజారాజ్యం పార్టీలో అంతర్గత వ్యవస్ధ పటిష్టంగా లేకపోవడం వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయి. ఎవరు ఏ పని చేయాలో తెలియని అయోమయ స్ధితి ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో నెలకొంది. జనం మధ్య తిరుగుతూ ఆనందం పొందుతున్నా, హాయిగా ఎసి రూముల్లో కూర్చుని ఇంతకన్నా ఎక్కువ మంది అభిమానుల ఆదరణ పొందిన ఒక వ్యక్తి ఆలోచించేది ఏమిటి? ఒక పొరపాటు చేశాననా? గ్రహపాటు సరిగ్గా లేదనా?

ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ప్రత్యర్ధి పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. అనేక కారణాలు తోడవడంతో ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్ధితులు వేరు. అనేక పార్టీలు రావడం వల్ల జనం అయోమయానికి గురవుతున్నారు. అయినా ఇప్పుడు పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం (మిత్రపక్షాలు) మధ్యనే.

చిరంజీవి పార్టీ అనేక జిల్లాలో అనేక పొరపాట్లు చేసింది. ఉదాహరణకు కృష్ణాజిల్లా కన్వీనర్ గా మాజీ ఎంపి కెపి రెడ్డయ్యను ప్రచారంలోకి తెచ్చి, ఒక అనామక మహిళకు ఆ పదవి కట్టబెట్టారు. విజయహైదరాబాద్: ఒక ఏడాది క్రితం వరకు ఆయన ఎంతో సంతోషమైన జీవితం గడిపారు. ముప్పై ఏళ్ళ క్రితం ఒక సామాన్య నటుడిగా తెలుగుతెర మీద అడుగుపెట్టి పాతికేళ్ళ పాటు సూపర్ స్టార్ గా వెలిగారు. వెండి తెర ద్వారా నిర్మాతలకు బంగారం పండించిన హీరో ఆయన. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏం సాధిస్తున్నారు?

ఆయన ప్రజారాజ్యం పార్టీలో అంతర్గత వ్యవస్ధ పటిష్టంగా లేకపోవడం వల్ల అనేక అనర్ధాలు జరుగుతున్నాయి. ఎవరు ఏ పని చేయాలో తెలియని అయోమయ స్ధితి ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో నెలకొంది. జనం మధ్య తిరుగుతూ ఆనందం పొందుతున్నా, హాయిగా ఎసి రూముల్లో కూర్చుని ఇంతకన్నా ఎక్కువ మంది అభిమానుల ఆదరణ పొందిన ఒక వ్యక్తి ఆలోచించేది ఏమిటి? ఒక పొరపాటు చేశాననా? గ్రహపాటు సరిగ్గా లేదనా?

ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ప్రత్యర్ధి పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. అనేక కారణాలు తోడవడంతో ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్ధితులు వేరు. అనేక పార్టీలు రావడం వల్ల జనం అయోమయానికి గురవుతున్నారు. అయినా ఇప్పుడు పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం (మిత్రపక్షాలు) మధ్యనే.

చిరంజీవి పార్టీ అనేక జిల్లాలో అనేక పొరపాట్లు చేసింది. ఉదాహరణకు కృష్ణాజిల్లా కన్వీనర్ గా మాజీ ఎంపి కెపి రెడ్డయ్యను ప్రచారంలోకి తెచ్చి, ఒక అనామక మహిళకు ఆ పదవి కట్టబెట్టారు. విజయవాడ అర్బన్ కన్వీనర్ పదవిని రాజకీయాలకు కొత్త అయిన కేసినేని బ్రదర్ కు అప్పగించారు. చాలా జిల్లాల్లో ఇదే పరిస్ధితి కనిపిస్తోంది.

ఏడాదికి ఒక సినిమా చేసుకుంటూ రజనీకాంత్ లాగా ఆనందంగా ఉండాల్సిన చిరంజీవికి ఈనాడు ఈ పరిస్ధితి దాపురించింది. ఆయన ఎంత కష్టపడి రోడ్ల మీద తిరిగినా గెలిచే అవకాశాలు పెద్దగా కన్పించడం లేదు. వాడ అర్బన్ కన్వీనర్ పదవిని రాజకీయాలకు కొత్త అయిన కేసినేని బ్రదర్ కు అప్పగించారు. చాలా జిల్లాల్లో ఇదే పరిస్ధితి కనిపిస్తోంది. ఏడాదికి ఒక సినిమా చేసుకుంటూ రజనీకాంత్ లాగా ఆనందంగా ఉండాల్సిన చిరంజీవికి ఈనాడు ఈ పరిస్ధితి దాపురించింది. ఆయన ఎంత కష్టపడి రోడ్ల మీద తిరిగినా గెలిచే అవకాశాలు పెద్దగా కన్పించడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X