Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎగ్జిట్ పోల్స్..హంగ్ అసెంబ్లీ

Assembly
న్యూఢిల్లీ: హెడ్ లైన్స్ టుడే ఛానెల్ వారు కాంగ్రేస్ కి 22, టీడీపి 14, టీఆర్ ఎస్ కి 5, ఎంఐఎం 1 వస్తాయి. టైమ్స్ నౌ, హెడ్ లైన్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండు సర్వేలు లోనూ టీఆర్ ఎస్ కు ఐదు స్ధానాలు వస్తాయని తేలింది. ఈ ఒక్క విషయంలోనే ఈ రెండు ఏకీభవించాయి.

కేంద్రంలో హంగ్‌ తప్పదని ఈ రోజు(బుధవారం) ఎగ్జిట్‌ ఫలితాలను టైమ్స్‌ నౌ విడుదల చేసింది. వారి అంచనా లెక్కల ప్రకారం కేంద్రంలో యుపిఎ కూటమికి 191, ఎన్‌డిఎ కూటమికి 180 సీట్లు, వామపక్ష పార్టీలకు 38, ఇతరులకు 134 సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని తెలియచేసారు. అయితే రాష్ట్రంలో (ఆంధ్రప్ర దేశ్‌లో) పరిస్థితి భిన్నంగా ఉన్నట్లు టైమ్స్‌ సర్వే చెబుతోంది. ఇక్కడ టిడిపి, కాంగ్రెస్‌లో చెరి 15 సీట్లు, టిఆర్‌ఎస్‌కు 5, పిఆర్పీకి 4, లెఫ్ట్‌ పార్టీలకు 2, ఎంఐఎంకు ఒక సీటు దక్కే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు.

బీహార్‌లో ఎన్‌డిఎ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తుందని, మహారాష్ట్రలో పరిస్థితి 50-50గా ఉన్నదనీ తేల్చిచెప్పింది. బీహార్‌లో జెడి (యు)కి 19 సీట్లు, బిజెపికి 10, ఆర్జేడీ-ఎల్జేపీ కూటమికి 6, లెఫ్ట్‌ పార్టీలకు ఒక సీటు దక్కే అవకాశం ఉందనీ, అలాగే మహారాష్ట్రలో ఎన్‌డిఎ కూటమికి 25, యుపిఎ కూటమికి 21, ఇతరులకు 2 సీట్లు లభిస్తాయని టైమ్స్‌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే వెల్లడించింది. కర్నాటకలో బిజెపి ఈసారి ఒకసీటు తక్కువగా 17 స్థానాలు సాధిస్తుందని, ఇక్కడ కాంగ్రెస్‌ 8, జెడి (ఎస్‌) కేవలం మూడు స్థానాలు సాధిస్తుందని టైమ్స్‌ అంచనా వేసింది.

అదేవిధంగా తమిళనాడులో అన్నాడిఎంకె కూటమి బలపడుతుందని, ఢిల్లీలోనూ బిజెపి మెరుగైన స్థానాలనే సాధిస్తుందని సర్వే తెలిపింది. రాజస్థాన్‌లో మాత్రం కాంగ్రెస్‌కు లాభించే అవకాశం ఉన్నదని, గుజరాత్‌లోనూ బిజెపికి క్లీన్‌స్వీప్‌ లభించే అవకాశం లేదని తేల్చి చెబుతూనే, మధ్యప్రదేశ్‌లో మాత్రం బిజెపి స్పష్టమైన ఆధిక్యాన్నే కనబరుస్తోందని చెబుతోంది. ఎన్‌డిఎ కూటమి అధిక స్థానాలను కైవసం చేసుకునేట్లు అంచనాలు కనిపించినా అంతిమంగా ప్రభుత్వ ఏర్పాటు బిజెపి బలం సరిపోదని టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌పోల్‌ అంచనాలు తేల్చాయి. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు విడుదల చేయరాదని సుప్రీం కోర్టు, ఈసి స్పష్టం చేయడంతో...తుది విడత పోలింగ్‌ ముగిసిన మరుక్షణం వరకూ ఆగి టైమ్స్‌ ఈ సర్వే వివరాలను ప్రకటించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+