బాబు మంత్రం ఫలిస్తుందా?

హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ఆ తొమ్మిదేళ్ళు ఆకాశంలో కాకుండా భూమార్గం పట్టి సామాన్యుల సంక్షేమాన్ని చూసి ఉంటే, ఆయన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సునాయాసంగా ఓడించగలిగే స్ధితిలో ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబు వల్లిస్తున్న సంక్షేమ మంత్రాలను జనం నమ్మలేకపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నిన్న ప్రకటించిన తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రధానమైనది నగదు బదిలీ పథకం, స్దానిక సంస్ధలకు అధికారాలు, పేదలకు ఉచిత కలర్ టీవీలు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదురోజుల పనిదినాలు ముఖ్యమైనవి.

తాను అధికారంలో ఉన్నప్పుడు విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ లో ఆయన సబ్సిడీలకు, సంక్షేమ పథకాలను వ్యతిరేకించారు. ఉచిత విద్యుత్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఐదేళ్ళకే ఆయన ప్లేటు ఫిరాయించి అవన్నీ ఇస్ధాననడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఎలాగైనా అధికారంలోకి రావడానికే ఆయన ఇలా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు మేనిఫెస్టో ఆచరణలో అమలుకు సాధ్యపడదని కాంగ్రెస్, లోక్ సత్తా, ప్రజారాజ్యం పార్టీలు విమర్శించాయి.

చంద్రబాబు ఆల్ ఫ్రీ మంత్రానికి ఓట్లు రాలితే దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ బాగాఅ దెబ్బతినే అవకాశముందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. పేదలందరికీ ఈ పథకాలను వర్తింపజేయలేరు కాబట్టి తెలుగుదేశం నాయకులు ఫిఫార్సులు చేసిన వారికి మాత్రమే తొలి దశలో లబ్ది చేకూరే అవకాశముంది. గతంలో తెలుగుదేశం హయాంలో పనికి ఆహారం పథకం కూడా పచ్చ చొక్కాల పథకంగా అమలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+