వైయస్ జగన్ సీక్రెట్ సర్వేలు

వెంటనే పార్టీ పెడితే బలమైన శక్తిగా అవతరిస్తుందని ప్రజాభిప్రాయంగా వెల్లడైతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైన వ్యూహరచన చేసుకోవాలని, కిరణ్ కుమార్ రెడ్డిపై గానీ కాంగ్రెసు పార్టీపై గానీ అంతగా వ్యతిరేకత లేదనుకుంటే మరింత కాలం ఆగాలని ఆయన అనుకుంటున్నారట. కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దగా వ్యతిరేకత లేకపోతే ఆయనను బలహీనపరిచే కార్యక్రమాలు తీసుకుంటారని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని కావల్సినంత నష్టపరిచి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేయడం పనిగా పెట్టుకుంటారని సమాచారం.
జాతీయ స్థాయి నాయకత్వంపై ఆయన ఇప్పటికే యుద్ధాన్ని ప్రకటించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై, రాహుల్ గాంధీపై సాక్షి మీడియా ద్వారా వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై కూడా అదే విధమైన ప్రచారం మొదలు పెడతారనడంలో సందేహం లేదు. వైయస్ జగన్ ను అణచేయడానికే కాంగ్రెసు అధిష్టానం పదవుల పందేరాన్ని సాగిస్తోందని వైయస్ జగన్ వర్గం ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది.












Click it and Unblock the Notifications