11-11-11: మిరాకిల్ డే

ఈ రోజు(శుక్రవారం) స్నేహితులను, బంధువులను పిలిపించుకొని ఎంగేజ్ మెంట్‌లా చిన్నగా చేసుకుంటారు. అ తర్వాత యథావిథిగా పంచాంగం ప్రకారం పెళ్లి చేసుకుంటారు. ఇది ఢిల్లీలో మరీ ఎక్కువగా ఉందట. మన రాష్ట్రంలో 11-11-11 ప్రభావం అంతగా కనిపించనప్పటికీ కొందరు దాని పైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. కొందరు ఈ రోజు తమ పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే ఈ రోజు(శుక్రవారం) పదకొండు గంటల పదకొండు నిమిషాలకు అంటే 11-11-11-11-11కు తమ సిజేరియన్లు అయ్యేలా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇలాంటి నమ్మకాలతో సిజేరియన్లు చేయించుకోవడం, పెళ్లిళ్లను ఆఫుకోవడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. డెలివరీ డేట్ ఎప్పుడుంటే అప్పుడే చేయించుకోవాలని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు.
అయితే చరిత్రలో కూడా 11-11-11కు చాలా ప్రాధాన్యత ఉంది. 11-11-1911న అంటే సరిగ్గా వందేళ్ల క్రితం కింగ్ జార్జ్ ఢిల్లీని రెండోసారి దేశ రాజధానిగా నెలకొల్పిన విషయం గుర్తుకు వస్తుంది. అంతేకాదు కింగ్ అండ్ క్వీన్ మేరీ తమ పవిత్ర ప్రయాణాన్ని కూడా వందేళ్ల క్రితం ఇదే రోజు పోర్ట్స్‌మౌత్ నుండి ప్రారంభించారు. అయితే 11-11-11 మాత్రమే కాకుండా మరో సంవత్సరం మీద నెల రోజులు ఆగితే 12-12-12 వంటి మిరాకిల్ డే కూడా వస్తుంది. కాగా విశాఖ సాగర తీరంలో స్థానికులు 11-11-11 సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications