వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి జనార్ధన్ రెడ్డి బూతు పురాణం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
కర్నాటక భారతీయ జనతా పార్టీ మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి పర్సనల్ లాప్ టాప్‌లో బూతుబొమ్మలున్నాయట. ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిని, మైనింగ్ కంపెనీ డైరెక్టర్‌ని సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మైనింగులో ఆయన అక్రమాల చిట్టా విప్పడానికి సిబిఐ అధికారులు బళ్లారిలోని ఆయన ఇంట్లో, ఆయన సన్నిహితుల ఇళ్లలో, పలు మైనింగ్ కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు, నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిబిఐ అధికారులు గాలి అక్రమాల గురించి మరింత సమాచారం తెలుస్తుందన్న ఉద్దేశ్యంతో గాలి పర్సనల్ లాప్ టాప్ తెరిచారని అందులో అన్నీ బూతు బొమ్మలే కనిపించాయని ప్రముఖ టీవీ ఛానల్ ప్రసారం చేసింది.

అక్రమాల సమాచారం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో గాలి లాప్ టాప్ తెరిచిన అధికారులు అన్నీ బూతుబొమ్మలే దర్శనమివ్వడంతో అవాక్కయ్యారట. సోదాల సమయంలోనే గాలి బెడ్ రూంలో బూతు సిడిలి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. కానీ ఏకంగా లాప్ టాప్‌లో ఉండటంతో వారు నోరెళ్లబెట్టారట. బూతు బొమ్మలతో పాటు గే ఫోటోలు కూడా ఎక్కువగా ఉన్నాయట. లాప్ టాప్‌లో దొరికిన సమాచారం మేరకు గేలతో ఎక్కువగా చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది.

గాలి జనార్ధన్ రెడ్డి తన ఇంటి సెక్యూరిటీ గార్డులుగా బీహారీ వారినే నియమించుకునే వారట. అయితే ఏ సెక్యూరిటీ గార్డు రెండు మూడు నెలలకు మించి పని చేసే వారు కాదట. గాలి వేధింపులకు తాళలేకే వారు పారిపోయే వారని సమాచారం. కేసు నిమిత్తం ప్రస్తుత సెక్యూరిటీ గార్డులతో పాటు, గతంలో పని చేసిన వారి కోసం సిబిఐ వేతుకులాట ప్రారంభించిందట. మొత్తానికి గాలికి డబ్బు పైనే కాదు శృంగారంపైనే వ్యామోహం ఎక్కువగా ఉన్నట్లుంది.

English summary
It seems, CBI found porn videos in Karnataka former minister Gali Janardhan Reddy laptop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X