శ్రీజ కోసం రామ్ చరణ్ తేజ్ త్యాగం

Ram Charan Teja
తన సోదరి శ్రీజ భవిష్యత్తు కోసం మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, హీరో రామ్ చరణ్ తేజ త్యాగానికి సిద్ధపడ్డాడు. భర్త శిరీష్ భరద్వాజ్‌తో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిన శ్రీజకు అండగా నిలవాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆయన తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారట. హీరో అల్లు అర్జున్ పెళ్లి జరగడంతో చిరంజీవి కుటుంబంలో ఇక జరగాల్సింది రామ్ చరణ్ తేజ పెళ్లే అనుకున్నారు. అయితే, శ్రీజ వ్యవహారంతో చిరంజీవి కుటుంబంలో కొత్త సమస్య ప్రారంభమైంది.

శ్రీజ సమస్య పరిష్కారమైన తర్వాతనే తాను పెళ్లి చేసుకుంటానని రామ్ చరణ్ తేజ కుటుంబ సభ్యులకు చెప్పారట. అసలు, శిరీష్ భరద్వాజ్ ప్రవేశంతోనే కుటుంబంలో సమస్య మొదలైందని, సాఫీగానూ ప్రశాంతంగానూ సాగిపోతున్న కుటుంబంలో శిరీష్ భరద్వాజ్ ప్రవేశం అశాంతిని సృష్టించిందని రామ్ చరణ్ తేజ భావిస్తున్నారట. శిరీష్ భరద్వాజ్‌పై శ్రీజ పెట్టిన కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది.

విడాకులు తీసుకున్న తర్వాత శ్రీజ ఒంటరిగా ఉండిపోవడానికి వీలు లేదని రామ్ చరణ్ తేజ అంటున్నట్లు సమాచారం. ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలని, ఆమెకు తగిన వ్యక్తిని అందుకు ఎంపిక చేయాలని ఆయన అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సమస్యను తన తండ్రి చిరంజీవి పరిష్కరించగలరని కూడా ఆయన ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+