అతడు ఆమెగా మారి...

Rose Transgender
మన దేశంలో హిజ్రాలు, స్వలింగ సంపర్కులపై ఇప్పటికీ చాలా మందిలో సదభిప్రాయం లేరు. మరి తర తరాల నుంచి వారిపై సమాజంలో పేరుకు పోయిన ఏహ్య భావమో? లేక అలాంటి వారి వల్ల మరింత మంది అలా తయారవుతారనే భయమో? ఏమోగానీ ఇప్పటికీ సమాజం వారిని కలుకు పోవడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక హిజ్రా అన్ని అడ్డంకులను తొలగించుకుని, ట్రాన్స్ జెండర్ గా మారి, టీవీ యాంకర్ గా ఎదిగి చాలా మంది అభిమానులను సంపాదించుకుదంటే మాటలు కాదు. నమ్మశక్యంగా లేదు కదూ. ఆమె పేరు రోజ్. ఓ తమిళ ఛానల్ లో ఇప్పడిక్కు రోజ్ టాక్ షో యాంకర్ గా పని చేస్తుంది. ఒక హిజ్రా సమాజంలో స్థాయిక తగ్గట్టు బ్రతకడం కష్టమే. కానీ రోజ్ ఆ స్థాయికి ఎదిగింది.

బుల్లి తెరపై ఓ మెరుపులా మెరుస్తున్న రోజ్...దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ గా రికార్డులకెక్కింది. ఇంతటితో ఊరుకోలేదు. ఓ పాప్ ఆల్బమ్ కూడా రూపొందించింది. సంగీతం, గానం, గాత్రం అన్నీ తానే అయి రూపొందిన ఆ ఆల్బమ్ త్వరలో ఐదు బాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రోజ్ కు ఇప్పడు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయట. అయితే తనను వెండి తెరపై చూసే తొలి అదృష్టం మాత్రం తెగులు ప్రేక్షకులకు మాత్రమే దక్కుతుందని అటోంది ఈ రోజా..

ఇంతకీ రోజ్ వ్యక్తిగత జీవితంలోకి వెళితే....అసలు పేరు రమేష్. చిన్నప్పుడే రమేష్ కు స్త్రీగా మారాలనే కోరిక కలిగింది. కానీ బయటకు చెప్పుకోవడానికి ధైర్యం లేక మనసులోనే ఉంచుకుంది. ఒక రోజు ఇదే విషయాన్ని కుటుంబ సభ్యలు ముందు ఉంచింది. కానీ కుటుంబంలో ఎవరూ అందుకు అంగీకరించక పోగా నానా చివాట్లు పెట్టారు. రమేష్ ను మార్చడానికి ఎంతో ప్రయత్నించారు. చివరకు పెళ్లి చేస్తే మారుతాడని భావించారు. కానీ రమేష్ వినలేదు. చివరకు ఇంట్లో నుంచి గెంటేశారు. అలా బయటకు వచ్చిన రమేష్ అప్పటి నుంచి ఆడదానిలా బ్రతకడం మొదలు పెట్టాడు. తన పేరును రోజ్ గా మార్చుకున్నాడు లాంగ్ హెయిర్ పెంచుకుని, ఆడవారిలా డ్రెస్సింగ్ చేసుకుని జీవించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు, లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాడు. అలా అని బిచ్చమెత్తుకోలేదు, చదువును నిర్లక్ష్యం చేయలేదు. బయోమెడికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ సాధించాడు. అది కూడా అమెరికాలో.

అమెరికాలో చదువు పూర్తి చేసుకు తిరిగొచ్చిన తర్వాత రోజ్ ఓ కాల్ సెంటర్ లో పని చేసేంది. అయితే ఆమె ట్రాన్స్ జెండర్ గా మారగానే కంపెనీ ఆమె కాంట్రాక్టును రద్దు చేసింది. అనంతరం కొన్ని తమిళ చానల్స్ లో యాంకర్ గా చేరింది. ఆమెతో రోజ్ పేరుతో రియాల్టీ టాక్ షోను డిజైన్ చేశారు. స్వలింగ సంపర్కుల హక్కులు, యంగ్ యంప్లాయిస్ లో విడాకులు, సామాజిక అంశాలు, కంరెంట్ అఫైర్స్ తో సాగే ఈ టాక్ షో ఇప్పడు తెగ పాపులర్ అయింది. ఇప్పటి వరకు దక్షిణాదిన ఈ ప్రోగ్రాంను 64 మిలియన్ల మంది చూసారంటే రోజ్ కు ఎంత మంది అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలా లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు, ఇంగ్లీష్ మీడియా నుంచి బీబీసీ వరకు రోజ్ పేరు మారుమ్రోగి పోతోంది. త్వరలో రాజకీయాల్లోకి కూడా రోజ్ అడుగపెట్టబోతోంది. సమాజ సేవతో పాటు, తన లాంటి వారికి అండగా నిలిచేందుకే ఆమె రాజకీయ ప్రయత్నమట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+