వైయస్ జగన్ యోగాభ్యాసం?

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి యోగాభ్యాసం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు గురువారం ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో ఓ వార్తాకథనం ప్రచురితమైంది. తనకు అత్యంత సన్నిహితులైన విజయ సాయి రెడ్డి, సునీల్ రెడ్డి అరెస్టయిన నేపథ్యంలో తన అరెస్టు కూడా తప్పదని మానసికంగా సిద్ధమైన జగన్ దర్యాప్తు సంస్థల ప్రశ్నల పరంపరలను తట్టుకోవడానికి, నోరు విప్పకుండా ఉండడానికి ఆయన గత మూడు నెలలుగా యోగాభ్యాసం చేస్తున్నారట. సిబిఐ అరెస్టు చేసిన తర్వాత విజయ సాయి రెడ్డి గానీ సునీల్ రెడ్డి గానీ ఏ మాత్రం తొణక్కుండా కనిపిస్తున్నారు. పైగా నవ్వులు చిందిస్తూ ఉల్లాసంగా వ్యవహరిస్తున్నారు. అలా ఎలా ఉండగలుగుతున్నారనేది అందరికీ ఆశ్చర్యకరమైన విషయమే.

విజయ సాయి రెడ్డి కూడా యోగాభ్యాసం చేశారట. అందుకే సిబిఐ అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం తొణక్కుండా తనకు తెలియదంటూ సమాధానాలు ఇచ్చేస్తున్నారని సమాచారం. యోగాభ్యాసం వల్లనే విజయ సాయి రెడ్డి అంత దీమాగా ఉండగలుగుతున్నారని చెబుతున్నారు. అందుకే వైయస్ జగన్ కూడా యోగాభ్యాసం చేస్తున్నట్లు చెబుతున్నారు. మానసికంగా ఒత్తిడికి లోను కాకుండా ఉండడానికి యోగాభ్యాసమే పనిచేస్తుందని భావిస్తున్నట్లు సమాచారం.

వైయస్ జగన్ ఉదయం, సాయంత్రం యోగాను అభ్యసిస్తున్నట్లు చెబుతున్నారు. జైలు పరిస్థితులను కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నట్లు ఆ తెలుగు పత్రిక రాసింది. తీహార్ జైలులో వాతావరణం గురించి కూడా జనగ్ ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఏమైనా జగన్ అరెస్టుకు సిద్ధపడినట్లు మాత్రం ఆ పత్రిక చెప్పకనే చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+