నాగార్జున గ్యాంబ్లర్ కాడు, ప్రేక్షకుడే..

లాస్ వేగాస్, అటువంటి ప్రదేశాలకు షూటింగ్ నిమిత్తం వెళ్లినప్పుడు సినీ స్టార్లు కాసినోలను సందర్శిస్తుంటారట. నాగార్జునకు కూడా ఆ అలవాటు ఉంది. అయితే, గ్యాంబిల్ చేయడానికి ఆయన అక్కడికి వెళ్లరు. కాసినో వాతావరణాన్ని చూడడానికి, అక్కడి ప్రజల తీరును పరిశీలించడానికి మాత్రమే తాను వెళ్తుంటానని ఆయన చెప్పినట్లు ఓ ఆంగ్ల పత్రిక రాసింది.
కాసినోల్లో తాను పది పదిహేను నిమిషాలకు మించి ఉండనని, తాను సంపన్నుడినేనని, కొన్ని ఆటలు ఆడగలనని, అయితే వ్యక్తిగతంగా శ్రమించి సంపాదించిన డబ్బులను అటువంటి వాటిలో పోగొట్టుకోవడం ఇష్టం ఉండదని, అటువంటి డెన్‌లకు దూరంగానే ఉంటానని ఆయన వివరించారు.
బెట్టింగు కోసం తాను కార్డులు కూడా ఎప్పుడూ ఆడలేదని ఆయన చెప్పారు. మొదలు పెడితే అది దురలవాటుగా మారిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇటువంటివాటిపై ధనాన్ని వృధా చేయడానికి బదులు సినిమాలు చూడడానికో, పుస్తకాలు చదవడానికో ప్రాధాన్యం ఇస్తానని ఆయన చెప్పారు.
ఎస్‌ఎంఎస్ కల్చర్‌ను ఆయన నిరసించారు. బాక్సాఫీస్ కలెక్షన్లను అది దెబ్బ తీస్తోందని ఆయన అన్నారు. థియేటర్లలోకి రాగానే చాలా మంది మిత్రులకు ఎస్ఎంఎస్‌ల ద్వారా సినిమాపై అభిప్రాయాలు తెలియజేస్తున్నారని, లేకుంటే కలెక్షన్లు ఎక్కువగా ఉండేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications