పరిటాల రవి వారసుడొస్తున్నాడు

Paritala Sriram
దివంగత తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అనంతపురంలోని తన నివాసంలో మంగళవారం ఆయన రాప్తాడు, అనంతపురం శాసనసభా నియోజకవర్గాలకు చెందిన పరిటాల అభిమానులతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ నెల 24వ తేదీన జరిగే పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంపై ఆయన వారితో చర్చించారు. ఇక నుంచి పరిటాల రవి ట్రస్టు నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో తాను ముందు ఉంటానని చెప్పారు. రాజకీయం పెద్దలు చూసుకుంటారని, రాజకీయం గురించి మాట్లాడే వయస్సు తనకు లేదని శ్రీరామ్ అన్నప్పటికీ భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే ఆయన క్రియాశీలకంగా ముందుకు వస్తున్నట్లు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సూచన మీద, అభిమానుల కోరిక మీద శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం ఆధారపడి ఉంటుందని పార్టీ శాసనసభ్యురాలు, పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీత చెప్పారు. పరిటాల ట్రస్టు సేవా కార్యక్రమాలకు మాత్రం ప్రస్తుతానికి శ్రీరామ్ నేతృత్వం వహిస్తారని ఆమె చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడే సయమం కాదంటూనే ఆమె శ్రీరామ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారనే సూచనను అందించారు. 2014 ఎన్నికల నాటికి ఆయన రాజకీయాల్లోకి రావచ్చునని చెబుతున్నారు. అందుకు తగిన ప్రాతిపదిక ఏర్పడుతున్నట్లు చెబుతున్నారు.

అనంతపురం జిల్లాలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా పరిటాల రవి కుటుంబం ఉంటూ వస్తోంది. తెలుగుదేశం పార్టీకి పరిటాల రవి మొదటి నుంచి బలాన్ని సమకూరుస్తూ వచ్చారు. ఇప్పుడు తన ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడానికి పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధపడినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+