జగన్ అరెస్టుకు ఉప ఎన్నికల లింక్?

అంతేకాకుండా జగన్‌ను అరెస్టు చేస్తే ఏర్పడే పరిణామాల పైనా ఆందోళన చెందుతున్నారట. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు జగన్‌ను అరెస్టు చేస్తే ప్రజలు ఎదురు తిరుగుతారని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌పై ఉప ఎన్నికల ఫలితాలను అనుసరించి నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఉన్నారని అంటున్నారు. రానున్న ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ అభ్యర్థులకు మెజార్టీ తగ్గినా, ఓడిపోయినా అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నారట. అలా కాకుండా జగన్‌ను తమ గూటికి తెచ్చుకునేందుకు కూడా కాంగ్రెసు పెద్దలు ప్రయత్నిస్తున్నారనే వాదన ఉంది. ఇప్పటికే శరద్ పవార్, మమతా బెనర్జీ వంటి వారు కాంగ్రెసు నుండి బయటకు వెళ్లి సొంత కుంపటి పెట్టుకున్నారు. కానీ కాంగ్రెసు వారిని దగ్గరకు చేర్చుకుంది. జగన్ విషయంలోనూ అదే జరగవచ్చునని కొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications