వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు, కృష్ణంరాజు: మొగల్తూరంటే ప్రసాద్ కూడా

By Srinivas
|
Google Oneindia TeluguNews

MYS Prasad
హైదరాబాద్/శ్రీహరికోట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) డైరెక్టర్‌గా సోమవారం నాడు ఎంవైఎస్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన తొలిసారి మంగళవారం మీడియాతో మాట్లాడారు. అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి ఈ ఏడాది నాలుగు రాకెట్లను ప్రయోగించనున్నట్లు కొత్త డైరెక్టర్ ప్రసాద్ వెల్లడించారు. ఈసారి ప్రయోగాల్లో మార్స్ ఆర్బిటల్ మిషన్ పేరిట అంగారక గ్రహయాత్ర ప్రధానమైనదని చెప్పా రు.

అక్టోబరులో పిఎస్ఎల్‌వి-సి25ద్వారా పంపుతున్న ఉపగ్రహం అంగారక గ్రహం చుట్టూ పరిభ్రమిస్తూ పరిశోధన సాగిస్తుందన్నారు. దీనికన్నా ముందు ఫిబ్రవరి తొలివారంలో పిఎస్ఎల్‌వి-సి20 ద్వారా "సరళ్'' ఉపగ్రహ ప్రయోగం ఉంటుందని తెలిపారు. సముద్రంలో అలల ఉధృతి, ఎత్తు, వాతావరణ సూచనలతోపాటు నావికా దళాలకు ఇది సమాచారం అందిస్తుందన్నారు. మే నెలలో పిఎస్ఎల్‌వి-సి22ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్ సిస్టమ్ శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపనున్నట్లు చెప్పారు.

అలాగే ఏప్రిల్ నెలలో జిఎస్ఎల్‌వి-డి5 ప్రయోగం ఉంటుందన్నారు. పిఎస్ఎల్‌వి-సి23, 24 రాకెట్లతో ప్రయోగించాల్సిన ఉపగ్రహాలు ఇంకా సిద్ధం కానందున వాటి ప్రయోగం ఇప్పట్లో ఉండదని ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. కాగా ప్రస్తుత షార్ డైరెక్టర్ ప్రసాద్ తెలుగువాడు. సినిమాలలో ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణం రాజుకు చెందిన మొగల్తూరు ప్రసాద్ స్వగ్రామం.

ఇప్పుడు మొగల్తూరు అంటే చిరంజీవి, కృష్ణం రాజుతో పాటు ప్రసాద్ కూడా గుర్తుకు వస్తారు. అతని పూర్తి పేరు మలపాక యజ్ఞేశ్వర సత్య ప్రసాద్. 1953లో మొగల్తూరులో జన్మించారు. 1968లో ఎఎస్ఎస్ఎల్‌, ఆ తర్వాత కాకినాడ జెఎన్టీయులో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1975లో ఇస్రోలో చేరి తిరువనంతపురంలోని స్పేస్ సెంటర్లో జూనియర్ శాస్త్రవేత్తగా వివిద హోదాల్లో పని చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కలిసి ప్రసాద్ పలు ప్రయోగాల్లో పాలు పంచుకున్నారు.

1994 నుండి 1998 వరకు ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఇస్రో కౌన్సెలర్‌గా విధులు నిర్వర్తించారు. 1999 నుండి 2005 వరకు కర్నాటకలోని హసన్‌లో మాస్టర్ కంట్రోల్ సెంటర్‌కు డైరెక్టర్‌గా, 2005 నుంచి 2008 వరకు అహ్మదాబాదులోని స్పేస్ అప్లికేషన్ సెంటరు డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేశారు. మరోవైపు 1995 నుంచి 2006 వరకు ఐక్యరాజ్యసమితిలో ఇస్రో సభ్యునిగా ఉన్నారు.

2008 నుంచి షార్లో అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్నారు. చంద్రయాన్-1 ప్రయోగంలో కీక పాత్రవహించిన వారిలో ప్రసాద్ ఉన్నారు. ప్రసాద్ అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న భారత అంతరిక్ష కేంద్రానికి డైరెక్టర్‌గా నియమితులయ్యారన్న విషయం తెలిసి మొగల్తూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Dr.MYS Prasad was took oath as SHAR director on Monday. He was from Magalturu of West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X