"దివ్యాంగుడి" లాగా రామ్ చరణ్.. ఉప్పెన లానే "పెద్ది" క్లైమాక్స్‌లో బిగ్ ట్విస్ట్..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఈ మూవీని గ్రామీణ వాతావరణంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముందుగా వచ్చిన వీడియోలో చరణ్ ఫుల్ గా జుట్టు, గడ్డంతో రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. అంతే కాకుండా ఉత్తరాంధ్ర యాసలో ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.. అంటూ చెప్పిన డైలాగ్ తెగ వైరల్ అయ్యింది. అంతే కాకుండా మరి ముఖ్యంగా రామ్‌చరణ్ కొట్టే ఐకానిక్ క్రికెట్ షాక్ కూడా ఫుల్ ట్రెండింగ్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది.

క్లైమాక్స్ లో పిచ్చెక్కించే ట్విస్ట్..
బుచ్చిబాబుకు దర్శకుడిగా ఇది రెండో చిత్రం అని అందరికీ తెలిసిందే. తన మొదటి చిత్రం ఉప్పెనలో ఎవరూ ఊహించని ట్విస్ట్ పెట్టి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ విషయంలో కూడా మూవీ చివర్లో పిచ్చెక్కించే ట్విస్ట్ ఉండబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టు గానే సినిమాకి సంబంధించి బుచ్చిబాబు రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక వీడియోలో చరణ్ షర్ట్ లేకుండా బల్క్ బాడీతో కనిపిస్తున్నట్టు ఒక ఫోటో వైరల్ అవుతోంది. అయితే అందులో సరిగ్గా గమనిస్తే చెర్రీ కాళ్లు మాత్రం ఉన్నట్టు కనిపించట్లేదు. దాంతో క్లైమాక్స్ ఏదో ఈసారి కూడా గట్టిగానే ప్లాన్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. సాధారణంగా స్పెషల్ సాంగ్ అంటే ఒకరు లేదా ఇద్దరు భామలు ఉంటారు. కానీ ఈ మూవీలో పాటలో ఒకరు, ఇద్దరు కాకుండా.. ఏకంగా నలుగురు లేదా ఐదుగురు హీరోయిన్లను పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. డాన్స్ విషయంలో రెచ్చిపోయే రామ్ చరణ్ పక్కన అంతమంది తారలు కలిసి చేసే సందడి థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు.
@AlwaysRamCharan #ramcharan #peddi @PeddiMovieOffl 💪🌟🙌🏽 pic.twitter.com/mrQiji2LPQ
— Mysterio (@Mysterior0) March 15, 2026












Click it and Unblock the Notifications