ఒకేఒక్కడు: సచిన్‌కు కానిది ధోనీకి సాధ్యమైంది!

MS Dhoni
భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా అత్యుత్తమ సారథులలోనే కాక సమకాలీన ప్రపంచ క్రికెట్ కెప్టెన్లలో కూడా ఉంటాడు. ట్వంటీ 20, వన్డే ప్రపంచ కప్‌లు, వన్డేల్లో అగ్రస్థానం, టెస్టు క్రికెట్లో అత్యధిక విజయాలు, గతంలో నెంబర్ వన్ పీఠం, తాజాగా చరిత్రాత్మక 4-0 సిరీస్ విజయం.. ఇవన్నీ కెప్టెన్‌గా ధోనీ సాధించిన ఘనతలు. అతని ప్రతిష్ట ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు చేరితే ఫేస్ వాల్యూను రూపాయల్లో లెక్కించాలంటే ఏడాదికి వంద కోట్లు..!

కేవలం ఎండార్స్‌మెంట్ల ద్వారా అతని సంపాదన ఇది. ధోనీ కో అంటే కోటే కాదు వంద కోట్లు కురవాల్సిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఈ స్థాయికి చేరిన తొలి ఆటగాడు అతనే. జట్టును నడిపించడంలోనే కాదు ధనార్జనలోనూ ధోనీయే నెంబర్ వన్. నడాల్, ఫెదరర్, మరియా షరపోవా, సెరెనా విలియమ్స్, టైగర్ ఉడ్స్, మెస్సీ, బెక్‌హామ్, రొనాల్డో.. ఏడాదికే వందలాది కోట్లు ఆర్జిస్తున్న ప్రపంచ స్టార్ క్రీడాకారులు.

ఎండార్స్‌మెంట్ల ద్వారా బాక్సింగ్, టెన్నిస్, సాకర్, గోల్ఫ్ తదితర క్రీడాకారులదే అత్యధిక ఆదాయం. వందలాది కోట్లు సంగతి అటుంచి ఏడాదికి వంద కోట్లు సంపాదించే క్రికెటర్ నిన్నటి మొన్నటి దాకా ఒక్కరూ లేరనే చెప్పవచ్చు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న వంద సెంచరీల వీరుడు, ఆల్‌టైమ్ గ్రేట్ సచిన్ టెండుల్కర్‍‌కు సైతం సాధ్యం కాలేదు. సాకర్, టెన్నిస్‌తో పోలిస్తే క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా విస్తృతి తక్కువగా ఉండడం కూడా కారణం కావచ్చు.

అయితే, అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని ఘనత ధోనీ సాధించాడు. ఎండార్స్‌మెంట్ల ద్వారా ఏడాదికి వంద కోట్లు ఆర్జిస్తున్న తొలి క్రికెటర్‌గా, భారత్‌లో తొలి క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. క్రీడాకారులకు ఆదాయంలో ఎక్కువ భాగం ఎండార్స్‌మెంట్ల రూపంలో వస్తుంది.ధోనీ వాణిజ్య ఒప్పందాలను రితీ స్పోర్ట్స్ పర్యవేక్షిస్తోంది. ఈ సంస్థ ఎండి అరుణ్ పాండే ధోనీ స్నేహితుడే. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం ధోనీ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది.

ఏడాదికి వంద కోట్ల రూపాయలకు చేరుకుంది. అత్యుత్తమ కెప్టెన్‌గా ఉన్న ఇమేజ్‌తో పాటు అరుణ్‌తో స్నేహం కూడా ధోనీకి కొంతవరకు కలిసొచ్చింది. ఫోర్బ్స్ మేగజైన్ రూపొందించిన ప్రపంచ సంపన్న క్రీడాకారుల జాబితాలో ధోనీకి 31వ స్థానం దక్కింది. ఒలింపిక్స్ స్ప్రింట్‌లో వరుసగా ఆరు స్వర్ణాలతో చరిత్ర సృష్టించిన జమైకా చిరుత ఉస్సేన్ బోల్ట్, ప్రపంచ టెన్నిస్ నెంబర్ వన్ జొకోవిచ్, సాకర్ స్టార్ వేన్ రూనీ కంటే ధోనీ ముందు వరుసలో ఉండడం విశేషం.

గతేడాది జూన్ నాటికి ధోనీ వార్షిక ఆ దాయం రూ.143 కోట్లు. దీనిలో ఎండార్స్‌మెంట్ల ద్వారా 127 కోట్లు చ్చాయి. ఇది సచిన్ సంపాదన కంటే దాదాపు 40 శాతం అధికం. కాగా ధోనీ ఇటీవలి ఒప్పందాలు, ఇతర ఆదాయాలను కలపలేదు. వీటన్నింటినీ కలిపితే ఫోర్బ్స్ జాబితాలో ధోనీ స్థానం 31 కంటే మరింత ముందుకు ఉంటుందని అంచనా. మూడేళ్ల క్రితం ధోనీ ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు దాదాపు 3 కోట్లు తీసుకుంటే ప్రస్తుతం ఆ మొత్తం పది కోట్లకు చేరింది.

ఎండార్స్‌మెంట్ల ద్వారా మాత్రమే ఏడాది 100 కోట్లకు పైచిలుకు సమకూరుతుంది. ఐపిఎల్, బిసిసిఐ తదితర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం అదనం. అభిమానుల్లో ఉన్న ఆదరణ, పేరు ప్రఖ్యాతులే వారికి కాసుల వర్షం కురిపిస్తాయి. ఒక్కో క్రీడాకారుడికి వాణిజ్య ప్రకటనలు పదుల సంఖ్యలో ఉంటాయి. స్టార్ క్రీడాకారులతో ఒప్పందం చేసుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు పోటీపడుతుంటాయి.

తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించడం ద్వారా అ మ్మకాలు పెంచుకునేందుకు ఆసక్తి చూపుతుంటాయి. టీమిండియా కెప్టెన్‌గా ధోనీ సాధించిన విజయాలు, తద్వారా వచ్చిన ఇమేజ్ అతని సంపాదనను అమాంతం పెంచేశాయి. ధోనీ రీబాక్, ఎయిర్‌సెల్, బూస్ట్, టివిఎస్, అశోక్ లేలాండ్, సియారామ్స్, టైటాన్, ఆమ్రపాలి, పెప్సీ బీవరేజస్ తదితర పదిహేడు కంపెనీల వాణిజ్య ప్రకటననలో కనిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+