సమీరా రెడ్డి భర్తనే: పవన్ కళ్యాణ్ బైక్‌కు డబుల్ కాస్ట్
హైదరాబాద్: బాలీవుడ్ బామ సమీరా రెడ్డి భర్త అక్షయ్ వర్ధే కస్టమ్ బైక్ కంపెనీ వర్దేంచీ యజమాని. పవన్ కళ్యాణ్, వెంకటేష్ హీరోలుగా వచ్చిన గోపాల గోపాల చిత్రంలో పవర్ స్టార్ ఉపయోగించిన బైక్‌ను అక్షయ్ వర్దే రూపొందించారు! సినిమాలో ఉన్న ఈ బైక్ విషయమై యువత చర్చించుకుంటోంది.
గోపాల గోపాల చిత్రం హిందీలో వచ్చిన ఓహ్ మై గాడ్ చిత్రం రిమేక్. దీనిని తెలుగు నేటివిటీకి తగినట్లుగా నిర్మించారు. హిందీ చిత్రంలోని బైక్, గోపాల గోపాల చిత్రంలోని బైక్‌కు పెద్దగా తేడా లేదు. అయితే, పవన్ ఉపయోగించిన బైక్‌లో కొన్ని కృష్ణుడు థీమ్స్ కనిపిస్తున్నాయి.
ఈ బైక్‌ను నెల రోజుల్లో తయారు చేశారట. ఓ ప్రాజెక్ట్ తీసుకున్నాక తాము అత్యంత వేగంగా డెలివర్ చేసిన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి అని అక్షయ్ వర్దె అంటున్నారట. బైక్ తయారీకి ముందు ప్రొడక్షన్ టీంతో కూర్చొని, ఎలా ఉండాలనే దానిపై చర్చించారు.

అనంతరం ప్రొడక్షన్ టీం వర్ధే ఫ్యాక్టరీకి వెళ్లింది. అక్కడ రెండు బైకులను పరిశీలించాయి. హిందీ ఓహ్ మై గాడ్ చిత్రం బైక్ కాస్ట్ పది లక్షల రూపాయలు అయితే, గోపాల గోపాల చిత్రం బైక్ కాస్ట్ అంతకు దాదాపు రెట్టింపు అయిందంటున్నారు. 2013లో బాలకృష్ణ హీరోగా వచ్చిన లెజెండ్ చిత్రం బైక్ అక్షయ్ వర్దే కంపెనీ నుండి వచ్చిందే.
కాగా, కాగా, గోపాల గోపాల సినిమా శనివారంనాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాపై మంచి టాక్ కూడా వచ్చింది. హిందీలో ఓహ్, మై గాడ్ సినిమాకు ఇది రిమేక్. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా విపరీతంగా ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఈ మధ్య కాలంలో ఉన్న క్రేజ్ కూడా సినిమాకు అనుకూలంగా పనిచేసిందని అంటున్నారు.
సినిమా ముఖ్యంగా దొంగ స్వాములు, మూఢ నమ్మకాలపై ఎక్కుపెట్టిన ప్రశ్నలతో ప్రేక్షకులను ఆలోచనలో పడేసే దిశగా ప్రయత్నించారు. అయితే సామాన్య జనాలకు పెద్దగా పరిచయం లేని 'యాక్ట్ ఆఫ్ గాడ్' క్లాజ్ చుట్టూ కథ తిరగటం, సెకండాఫ్ లో ఎక్కువ భాగం కోర్టు సీన్స్, మెలోడ్రామా, మెసేజ్‌తో నింపటం జరిగింది. అలాగే ఎంటర్టైన్మెంట్ పాళ్లు కూడా చాలా చాలా తక్కువగా ఉన్నాయి.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications