ట్విస్ట్: శశికళ గదికి అమర్చిన సిసిటీవి రికార్డులు మాయం, డిఐజీ రూప నివేదిక

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: పరప్పర ఆగ్రహర జైలులో చోటుచేసుకొన్న పరిణామాలపై జైళ్ళ శాఖ డిఐజీ రూప మరోసారి సంచలన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. శశికళ ఉన్న జైలు గదికి సంబంధించిన సీసీటీవి రికార్డులు మాయమయ్యాయని రిపోర్ట్ చేసింది.

ట్విస్ట్: 'నేను సర్వీస్‌రూల్స్‌ను ఉల్లంఘించలేదు', 'విచారణకు కర్ణాటక సీఎం ఆదేశం'

అన్నాడిఎంకె (అమ్మ) మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ కర్ణాటక రాష్ట్రంలోని పరప్పర ఆగ్రహర జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే ఆమెకు జైలులో రాచమర్యాదలు లభిస్తున్నాయని డిఐజీ తన నివేదికలో బట్టబయలు చేశారు.

అయితే రూప నివేదిక తమిళనాడుతో పాటు, కర్ణాటక రాష్ట్రంలో కూడ సంచలనానికి తెరతీసింది. అయితే డిఐజీ రూప ఎక్కడ పనిచేసినా కానీ, సంచలనాలకు కేంద్రంగా నిలుస్తారు. గతంలో ఆమె ఓ కేసులో అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమాభారతిని అరెస్ట్ చేశారు.

జైల్లో శశికళ కలకలం: మరో లేఖ రాసిన రూప, డీజీపీ పరుగు

సర్వీస్‌రూల్స్ పేరుతో ఉన్నతాధికారులు ఆమెను ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు తలెత్తాయి.అయితే సర్వీస్ రూల్స్ అందరికీ ఒకే రకంగా ఉండాలని ఆమె స్పందించారు.

రెండో నివేదికను ఇచ్చిన డిఐజీ రూప

రెండో నివేదికను ఇచ్చిన డిఐజీ రూప

పరప్పర ఆగ్రహర జైలులో చోటుచేసుకొన్న పరిణామాలపై జైళ్ళశాఖ డిఐజీ రూప మరోసారి సంచలన నివేదికను అందజేశారు. ఈ .జైలులో శిక్షను అనుభవిస్తున్న అన్నాడిఎంకె అధినేత్రి శశికళకు జైళ్ళశాఖాధికారులు రాచమర్యాదలు చేసిన విషయాన్ని ఆమె బయటపెట్టారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆమె ఈ జైలును సందర్శించారు. అయితే ఈ జైలులో చోటుచేసుకొన్న పరిణామాలను ఆమె బయటపెట్టారు. దీంతో జైలులో ఏం జరుగుతోందనే విషయం బయటకు వెలుగుచూసింది. అయితే తాజాగా రెండో నివేదికను కూడ ఆమె ప్రభుత్వానికి పంపింది. ఈ నివేదికలో కూడ కీలక అంశాన్ని ఆమె ప్రస్తావించారు. శశికళ ఉన్న జైలు గది వద్ద ఉన్న సిసిటీవి రికార్డులు మాయమయ్యాయని ఆమె ఈ నివేదికలో పేర్కోంది.

Sasikala bribes prison officers, gets luxury treatment in jail | Oneindia News
ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందా?

ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందా?

జైలులో శశికళకు విఐపీ ట్రీట్‌మెంట్ జరుగుతున్న విషయాన్ని ఆమె బయటపెట్టారు.అయితే ఈ విషయం వెలుగుచూడడంతో రాజకీయంగా కూడ చర్చనీయాంశంగా మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. అయితే శశికళకు జైలులో ఏ రకమైన విఐపి ట్రీట్‌మెంట్ జరిగిందనే విషయమై సిసిటీవి రికార్డులు దొరికితే ఆధారాలు దొరికేవని రూప అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయాలు బయటకు రాకూడదనే ఉద్దేశ్యంతో సిసిటీవి రికార్డులను మాయం చేసి ఉండవచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

విజిటర్స్ గ్యాలరీలో కెమెరాలు పనిచేస్తున్నాయి

విజిటర్స్ గ్యాలరీలో కెమెరాలు పనిచేస్తున్నాయి

విజిటర్స్ గ్యాలరీలో రెండు సిసిటీవి కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయని రూప తన నివేదికలో ప్రకటించింది. అయితే ఆడ్మిషన్ రూమ్‌లో కెమెరా పనిచేయడం లేదని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. శశికళను కలిసేందుకు వచ్చిన వారిలో శశికళ మాట్లాడిన గదిలో కెమెరాలున్నాయని, వాటి రికార్డింగ్స్‌ను ఎవరో డిలీట్ చేశారని తన విచారణలో తేలిందని రూప తన నివేదికలో వెల్లడించారు.

జైళ్ళ శాఖ ఉన్నతాధికారులకు ముడుపులు

జైళ్ళ శాఖ ఉన్నతాధికారులకు ముడుపులు

జైళ్ళ శాఖ ఉన్నతాధికారులు ముడుపులు తీసుకొని జైలులో విఐపీ ట్రీట్‌మెంట్ తీసుకొంటున్నారని తొలి నివేదికలో రూప స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే రెండో నివేదికను ఇచ్చారు. మొదటి నివేదిక కంటే రెండో నివేదికలో మరిన్ని ఆధారాలను పేర్కొన్నారు. సిసిటీవి రికార్డులు మాయం కావడంపై ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ముడుపులు తీసుకొని ఈ చర్యకు పాల్పడ్డారని ఆమె ఆరోపణలు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Deputy inspector general (prisons) D Roopa, who recently exposed alleged corrupt activities in jail, submitted her second report to DGP (Prisons) HN Sathyanarayana Rao on Saturday.
Please Wait while comments are loading...