వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో కోణం: హెచ్ 1 బీ వీసాలో కోత అమెరికాకే నష్టమా?

అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలన్న వాదాన్ని సంతృప్తి పరిచేందుకు లాఫ్‌గ్రీన్ ప్రవేశపెట్టిన హెచ్ 1 బీబిల్లులో కొన్ని లోపాలు ఉంటాయని నాస్కామ్ పేర్కొంది.

By Swetha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ / న్యూఢిల్లీ: విదేశీ ఉద్యోగులను తగ్గించి అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలపోస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇంతకుముందు అమలులో ఉన్న హెచ్ - 1 బీ వీసా చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ అమెరికా ప్రజాప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే.. భారత్ నుంచి అమెరికాకు ఉన్నత విద్య, తర్వాత ఉద్యోగం సంపాదించుకునేందుకు వెళ్లిన వారంతా తమ వీసా గడువు ముగియగానే అన్నీ సర్దుకుని వెనుదిరిగి రావాల్సిందే.

డిపెండెంట్ వీసాలకు, దంపతుల వీసాలకు ఇక తావు ఉండక పోవచ్చు. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన హెచ్ 1 బీ వీసా చట్ట సవరణ ప్రకారం ఐటీ కంపెనీలు తొలుత అమెరికన్ ఇంజినీర్‌ను నియమించుకోవాలి. ఒకవేళ విదేశీ సిబ్బందిని నియమించుకోవాల్సి వస్తే అత్యంత అధిక వేతనం చెల్లించాలి. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఆపిల్ వంటి దిగ్గజ టెక్నాలజీ సంస్థలు ప్రతిభావంతులైన ఉద్యోగుల నియామక విధానంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ కంపెనీలు పూర్తిగా నియామక పద్ధతులే మార్చుకోవాల్సి ఉంటుంది.

కొత్త బిల్లులో పేర్కొన్న నిబంధన ప్రకారం హెచ్ 1 బీ వీసా కింద పనిచేసే ఉద్యోగి కనీస వేతనం 60 వేల డాలర్ల నుంచి 1.30 లక్షల డాలర్లకు పెంచాలి. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ పాలసీ, అమెరికా సమాజం, ఆర్థిక వ్యవస్థ, కార్మికులు, విదేశాంగ విధానం, జాతీయ భద్రతపై దాని ప్రభావం ఎలా ఉందో విశ్లేషించేందుకు ఒక కమిషన్ లేదా సలహా సంఘాన్ని నియమించాలని కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రతిపాదించనున్నది. అమెరికా జాతీయ ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి అమలు చేసేలా మన దేశ వలస విధానాలు రూపొందించాల్సి ఉందని హెచ్ - 1 బీ వీసా చట్టం సవరణ బిల్లు ముసాయిదాలో ఉంది.

ఇండియాకు వరప్రదాయినే....

ఇండియాకు వరప్రదాయినే....

ఉద్యోగావకాశాలు కల్పించేందుకు హెచ్ 1 బీ వీసాలో భారీకోత విధించేందుకు చట్ట సవరణ చేయడం భారతదేశానికి వరంగానే పరిణమిస్తుందని విప్రో మాజీ అధ్యక్షుడు, హ్యాపీయెస్ట్ మైండ్స్ టె‌క్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అశోక్ సూత వ్యాఖ్యానించారు. ట్రంప్ నిర్ణయంతో ఐటీ పరిశ్రమ విదేశాలకు.. ప్రత్యేకించి భారత్‌కు తరలే అవకాశం ఉన్నదని, దీనివల్ల దీర్ఘ కాలంలో మనదేశానికి, భారత ఐటీ సంస్థలకు లబ్ది చేకూరనున్నదన్నారు. ఐటీ వంటి ప్రత్యేక రంగాల్లో అమెరికా ప్రతిభావంతుల కొరత ఎదుర్కోనున్నదన్నారు. అమెరికా ఐటీలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలను స్థానిక ఐటీ కంపెనీలు భర్తీ చేయలేవన్నారు. అమెరికాకు భారత్ లోని ఐటి నిపుణులు అవసరం అని స్పష్టంచేశారు. అయితే తాను ఆశావాదినని, అమెరికాలో విధానాలు మారినప్పుడల్లా భారత ఐటీ కంపెనీలు వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని లబ్ది పొందాయని అశోక్ సూత గుర్తుచేశారు.

అమెరికాకే నష్టం...

అమెరికాకే నష్టం...

అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలన్న వాదాన్ని సంతృప్తి పరిచేందుకు లాఫ్‌గ్రీన్ ప్రవేశపెట్టిన హెచ్ 1 బీబిల్లులో కొన్ని లోపాలు ఉంటాయని నాస్కామ్ పేర్కొంది. నర్సింగ్, లైఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ పరిశ్రమలపై ఈ బిల్లు ప్రభావం చూపుతుందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖరన్ తెలిపారు. అమెరికా కార్మికశాఖ వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటికే పది లక్షల మందికిపైగా నిరుద్యోగులు ఉన్నారని దీనికి తోడు రాజకీయ కారణాలతోగానీ, ఆవేశంగా గానీ నిపుణులపై విధించే ఆంక్షల వల్ల ఆ ఉద్యోగాలను అమెరికా కంపెనీలు భర్తీ చేయలేవని, దీనికి తోడు సదరు ఉద్యోగాలన్నీ విదేశాలకు తరలుతాయని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమన్నారు.

అమెరికా సంస్థల ధిక్కారం...

అమెరికా సంస్థల ధిక్కారం...

హెచ్ 1 బీ వీసా చట్టం కఠినతరం చేయడం వల్ల ఐటీ రంగ పరిశ్రమపై గణనీయ ప్రభావం చూపుతుందని బెంగళూరు చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జనరల్ రాజు భట్నాగర్ వ్యాఖ్యానించారు. దీనికి వ్యతిరేకంగా అమెరికా కంపెనీలే ముందు వరుసలో నిలిచి ఈ చట్టాన్ని అమలు చేయొద్దని ట్రంప్ సర్కార్ పై ఒత్తిడి తీసుకొస్తాయని.. ఇప్పటికే తీవ్రస్థాయిలో ధిక్కారస్వరం వినిపిస్తున్నాయని తెలిపారు. ఒకవేళ పరిస్థితులు విషమిస్తే వలస వాదులను ఆదుకునేందుకు సాఫ్ట్ వేర్ దిగ్గజం ‘గూగుల్' నాలుగు మిలియన్ డాలర్ల సహాయ నిధి సిద్ధం చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వంతో అమెరికా దిగ్గజ కంపెనీలన్నీ ముఖాముఖీ తలపడతాయని స్పష్టంచేశారు. భారత ఐటీ కంపెనీలు కూడా మారిన పరిస్థితులకు అనుగుణంగా తమ ఆర్థిక విధానాలను పునర్నిర్వచించుకుంటాయని రాజు భట్నాగర్ తెలిపారు. ఇతర దేశాల్లో విధుల నిర్వహణ ద్వారా ఆదాయాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాయని చెప్పారు.

విదేశీ ఉద్యోగుల కోసమే...

విదేశీ ఉద్యోగుల కోసమే...

ప్రత్యేకమైన విభాగాల్లో సిద్ధాంతపరమైన, సాంకేతికపరమైన నైపుణ్యం అవసరమైన రంగాల్లో ఉన్నత విద్యావంతులైన విదేశీ ఉద్యోగుల నియామకానికి అనుమతించే నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాను హెచ్-1బీ గా పిలుస్తారు. సైంటిస్టులు, ఇంజినీర్లు లేదా కంప్యూటర్ ప్రోగ్రామర్లు వంటి వృత్తి నిపుణులు ఈ క్యాటగిరీలోకి వస్తారు. ప్రతి ఏటా అమరికా 65వేల హెచ్-1బీ వీసాలను జారీచేస్తుంది. 2014లో ప్రపంచ వ్యాప్తంగా హెచ్ 1 బీ వీసా పొందిన వారిలో 70 శాతం భారతీయులే. ప్రస్తుతం అమెరికాలో సుమారు 3.5 లక్షల మంది భారతీయ ఇంజనీర్లు ఉన్నారని ఒక అంచనా. ప్రస్తుతం అమెరికాలోని ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్నవారిలో 60శాతానికి పైగా హెచ్-1బీ వీసాదారులే. ఇంకో గమ్మత్తేమిటంటే 2016 ఆగస్టు వరకు భారతీయులు 72 శాతం హెచ్ 1 బీ వీసా, 30 శాతం ‘ఎల్ 1' వీసా పొందారు.

న్యాయపోరాటానికి దిగ్గజ కంపెనీలు

న్యాయపోరాటానికి దిగ్గజ కంపెనీలు

ట్రంప్ సర్కారు ఉత్తర్వుపై వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ వేసిన పిటిషన్‌కు మద్దతు తెలుపనున్నట్టు అమెజాన్ సీఈవో జెఫ్రీ బెజోస్ కంపెనీ ఉద్యోగులకు ఈ మెయిల్ పెట్టారు. న్యాయవాదులు ఇందుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేశారని ఆయన చెప్పారు. గూగుల్, ఎయిర్ బీఎన్బీ, నెట్‌ఫ్లిక్స్ వంటి బడాకంపెనీలు ట్రంప్ విధానంపై పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

English summary
A proposed new law that will effectively cut down the number of H-1B visa entrants into the US could actually turn out to be a blessing in disguise for India, a technology industry veteran told. Ashok Soota, former president of Wipro and Executive Chairman of Happiest Minds Technologies, said that more work will now move offshore as US is set to face a talent crunch in these specialized sectors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X