వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డిపై 'వెలి' కత్తి?: రిజైన్‌తో టీడీపీ ప్రతివ్యూహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టైన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన అసెంబ్లీ కాలపరిమితి ముగిసే వరకు వెలివేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి పావులు కదుపుతోందా? అంటే అవుననే విధంగా వార్తలు వస్తున్నాయి.

రేవంత్ పైన నాలుగేళ్ల పాటు సస్పెన్షన్ లేదా బహిష్కరణ వేటు వేయాలని యోచిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, తెరాస ఎత్తుకు పైఎత్తు వేయాలని తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది.

రేవంత్‌ రెడ్డితో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించి అసెంబ్లీలో అడుగుపెట్టేలా చూడాలని భావిస్తోంది. దీంతో టీడీపీ, టీఆర్‌ఎస్‌ రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ పైన వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం సాగుతోంది.

పార్టీ ముఖ్యులు, ప్రభుత్వంలోని పలువురు మంత్రులు రేవంత్‌ను అసెంబ్లీ నుంచి డిస్మిస్‌ చేయాలనే డిమాండ్‌ను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెరాసకు రేవంత్‌ ఆది నుంచి కంట్లో నలుసుగా మారిన విషయం తెలిసిందే.

ఆయన అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. మెట్రో భూముల వ్యవహారంలో మైం హోం రామేశ్వర రావుకు కేసీఆర్‌ సహకరించినట్లు వరసపెట్టి ఆరోపణలు గుప్పించారు. దీంతో తెరాస పార్టీ యావత్తు రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేసింది.

తమ పార్టీ ఎంపీ కవిత సర్వేలో పాల్గొనడానికి సంబంధించి లోగడ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేదాకా ఆయనను అసెంబ్లీలో అడుగు పెట్టనిచ్చేదిలేదని నటకాచ ఎమ్మెల్యేలు చాలామంది బహిరంగంగానే ప్రకటనలు చేశారు.

Is TRS planning to suspend MLA Revanth Reddy?

ఆ తర్వాత జాతీయ గీతాన్ని అవమానించారంటూ బడ్జెట్‌ సమావేశాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. ఇది కూడా రేవంత్‌ టార్గెట్‌గా చేసిందనే చెబుతారు. తెరాస, రేవంత్‌ ముఖ్యంగా కేసీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌ అనేలా అప్రకటిత యుద్ధం సాగింది. ఇప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకొని అతని పైన వేటు వేయాలని భావిస్తున్నారని సమాచారం.

రేవంత్‌పై చర్యలకు సంబంధించి రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ఒకటికాగా, రెండోది రేవంత్‌ను సభ నుంచి బహిష్కరించడం. అంటే, ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగుతారు.

కానీ ప్రస్తుత శాసనసభ కొనసాగేదాకా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా సస్పెండ్‌ చేస్తారు. ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తే ఆ తర్వాత ఆరు నెలల్లోగా ఆ స్థానానికి ఉప ఎన్నిక వస్తుంది. అప్పుడు రేవంత్‌ మళ్లీ పోటీ చేసే వీలుంటుంది.

ఏదేని చట్ట సభకు చెందిన సభ్యుడు నిర్దేశిత నిబంధనలు ఉల్లఘించిన సందర్భంలో సభ్యత్వాన్ని రద్దు చేయటంతోపాటు, గరిష్ఠంగా ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే ఉంది.

ఒక సభ్యుడిని సభ కొనసాగినంత కాలం సస్పెండ్‌ చేయటం, సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం తప్ప, ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే అధికారం ప్రభుత్వానికి లేదు.

ఈ క్రమంలో రేవంత్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలా? సభకు రాకుండా సస్పెన్షన్‌ వేటు వేయాలా? అనే అంశంపై తెరాస ముఖ్యుల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీనికి టీడీపీ కూడా ప్రతివ్యూహం రచిస్తోందని అంటున్నారు. ఆయనచే రాజీనామా చేయించి, ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించి, రేవంత్‌ను గెలిపించుకోవాలని చూస్తోందని సమాచారం.

English summary
Is TRS planning to suspend MLA Revanth Reddy?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X